కూతురే కాదు తల్లి కూడా అదే దందాలో.. వీడియో వైరల్
మహారాష్ట్రలో ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిషన్ సమయంలో పూర్తి స్థాయి అధికారిగా హల్‌చల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురై బదిలీ వేటు ఎదుర్కొంది. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది.
మహారాష్ట్రలో ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిషన్ సమయంలో పూర్తి స్థాయి అధికారిగా హల్‌చల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురై బదిలీ వేటు ఎదుర్కొంది. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది. అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్కర్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నించాడని స్థానికులు ఆరోపించారు. ఆ స్థలం వద్దే పెద్ద గొడవైంది. రైతులు వ్యతిరేకించడంతో సర్పంచ్‌గా ఉన్న పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్కడకు చేరుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకొచ్చి రైతులను బెదిరించారు. గన్ చూపిస్తూ “ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు” అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయి ఉందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. “కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో…నాకే రూల్స్ చెప్పకు” అని తుపాకీతో అతడికి వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

