- Telugu News Photo Gallery An Apple A Day: health benefits of eating a apple daily know time and details
An Apple A Day: రోజుకో యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తినడానికి కూడా సమయం ఉందని తెలుసా..
'రోజూ ఒక యాపిల్ తినండి.. డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం' రాదు అనే మాట చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ఈ పెద్దలు చెప్పే మాట చాలా వరకు నిజం. ఎందుకంటే ఆపిల్ మంచి పోషకాహారం. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాపిల్ విటమిన్ సి దొరికే అద్భుతమైన పదార్ధం. ఈ ఆపిల్‌లో బి-కాంప్లెక్స్, విటమిన్ ఇ , కె కూడా ఉన్నాయి. అంతేకాదు ఆపిల్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
Updated on: Jul 16, 2024 | 10:41 AM

ఎవరైనా సరే దినచర్యలో భాగంగా తినే ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవాలనుకుంటే.. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత ఆపిల్ తినడానికి ఉత్తమ సమయం లేదా పగటిపూట తినాలి. వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వలన కొన్నిసార్లు జీర్ణం అవ్వడం కష్టమవుతుంది. అయితే ఈ రోజు రోజూ ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా: రోజూ యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాస్తవానికి యాపిల్ లో పొటాషియం ఉంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని తినడం వలన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. యాపిల్స్‌లో ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడే అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

జీర్ణక్రియ మెరుగు: మలబద్ధకంతో బాధపడేవారికి కూడా యాపిల్ తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాపిల్ శక్తిని ఇస్తుంది: యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. యాపిల్‌లో ఫ్రక్టోజ్ కూడా ఉంది. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కనుక ఆపిల్‌ను ఆఫీసులో అల్పాహారంగా తీసుకోవచ్చు లేదా అల్పాహారం తర్వాత తినవచ్చు. యాపిల్ ను ఎప్పుడూ పైన తొక్కతోనే తినాలని గుర్తుంచుకోవాలి.

యాపిల్ చర్మానికి మేలు: రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొద్ది రోజుల్లోనే దీని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తినడం వల్ల, చర్మం లోపల నుండి ఆరోగ్యంగా మారుతుంది. ముఖంపై సహజమైన పింక్ గ్లో కనిపిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు: యాపిల్ తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది చాలా తీపిని కలిగి ఉన్నప్పటికీ.. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై తక్కువ ప్రభావాన్ని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇతర పోషకాలు ఉన్నాయి. దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.




