- Telugu News Photo Gallery Technology photos CMF Launches new earbuds CMF Buds Pro 2 features and price details
CMF Buds Pro 2: చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్ ఇయర్ బడ్స్.. ఫీచర్స్ కూడా సూపర్..
లండన్‌కు చెందిన నథింగ్ సబ్‌బ్రాండ్ సీఎమ్‌ఎఫ్ తాజాగా గ్యాడ్జెట్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎమ్‌ఎఫ్ ఫోన్ 1, సీఎమ్‌ఎఫ్ వాచ్ ప్రో 2లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఇయర్ బడ్స్‌ను కూడా తీసుకొచ్చాయి. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 15, 2024 | 9:59 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ సీఎమ్‌ఎఫ్ తాజాగా మార్కెట్లోకి ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేశాయి. సీఎమ్‌ఎఫ్ బడ్స్ ప్రో 2 పేరుతో కొత్త ఇయబర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను అందించారు.

ఈ ఇయర్ బడ్స్ 50డీబీ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలైజేషన్‌ను అందించారు. దీంతో ఈ నాణ్యతతో కూడిన కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 43 గంటలపాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

ఇయర్ బడ్స్‌ను నేరుగా చాట్ జీపీటీతో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బడ్స్‌లో 60 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 460 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ కేస్‌తో తీసుకొచ్చారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేయడానికి 70 నిమిషాలు పడుతాయి.

ఇక ఈ ఇయర్ బడ్స్ బరువు విషయానికొస్తే ఒక్కో బడ్ 4.9 గ్రాములుగా ఉంటుంది. రెండింటితోపాటు, ఛార్జింగ్ కేసు మొత్తం కలిపి 55.8 గ్రాముల బరువు ఉంటుంది.

ధర విషయానికొస్తే సీఎమ్‌ఎఫ్ బడ్స్ ప్రో2 రూ. 4299గా నిర్ణయించారు. జులై 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.




