ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్…. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. హింసను అణచలేక ఈ ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తున్ననట్టు ఉందని పేర్కొంది.

  • Publish Date - 3:45 pm, Sun, 20 June 21 Edited By: Phani CH
ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్.... మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. హింసను అణచలేక ఈ ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తున్ననట్టు ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అల్లర్లను అదుపు చేయాల్సిన బాధ్యత…అదే సమయంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవలసిన కర్తవ్యం ఈ ప్రభుత్వంపై ఉందని, కానీ…ఇది చాలా ఇనాక్టివ్ (చలనరహితంగా) గా ఉందని విమర్శించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కమిటీని ఏర్పాటు చేసి తన నివేదికను ఈ నెల 30 లోగా సమర్పించాలని 5 గురు జడ్జీలతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఎన్నికల అనంతర హింసతో బాటు ఇప్పటికీ అనేక చోట్ల అల్లర్లు కొనసాగుతున్నాయంటూ దాఖలైన పిల్స్ ను ఈ బెంచ్ విచారించింది. ఈ కమిటీ అన్ని కేసులను దర్యాప్తు చేయాలని..సమగ్రమైన రిపోర్టు దాఖలు చేయాలని కూడా కోర్టు సూచించింది. ఈ కమిటీ సభ్యులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారికి అవరోధాలు కల్పించరాదని… ప్రభుత్వం సహకరించాలని కోర్టు కోరింది.లేని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలతో సహా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా ఈ ఆదేశాలపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని మమత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తాము శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పోలీసులు ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో అక్కడక్కడా హింస జరిగిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వివరించింది. ఇలా ఉండగా ఇటీవల గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ..ఢిల్లీకి కూడా వెళ్లి రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ నేతలకు ఏకరువు పెట్టారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు

Errabelli : కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని చూడలేదు, హుజూరాబాద్ కు ఈటెల ఎవర్నీ రానిచ్చేవాడు కాదు : ఎర్రబెల్లి