Errabelli : కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని చూడలేదు, హుజూరాబాద్ కు ఈటెల ఎవర్నీ రానిచ్చేవాడు కాదు : ఎర్రబెల్లి

నా సుదీర్ఘ నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈటెల రాజేందర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలన్నీ

Errabelli : కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని చూడలేదు,   హుజూరాబాద్ కు ఈటెల ఎవర్నీ రానిచ్చేవాడు కాదు : ఎర్రబెల్లి
కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచుతున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ- ఆంద్రప్రదేశ్ లో ఎందుకు సీట్లు పెంచారో సమాధానం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు.

Errabelli Dayakar Rao comments on Etela Rajender : నా సుదీర్ఘ నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈటెల రాజేందర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పులేనని ఆయన వ్యాఖ్యానించారు. కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసినవారు ఎవరూ పార్టీలో మిగలరని ఎర్రబెల్లి చెప్పారు. టీఆరెస్ పార్టీ ఆనాడు టిక్కెట్ ఇచ్చింది కాబట్టి ఈటెల గెలిచాడు… ఈటల కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఇక్కడ గెలిచేవారు అని హుజురాబాద్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేరే మంత్రులు ఎవ్వరినీ ఈ నియోజక వర్గానికి రానిచ్ఛేవాడు కాదని.. ఆఖరికి తనను కూడా రాజేందర్ హుజూరాబాద్ రావటానికి ఇష్టపడే వాడు కాదని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గం లో TRS పార్టీ ఇంచార్జ్ లు స్పీడ్ పెంచారు. కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటెలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎర్రబెల్లి.. వచ్చే ఉప ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగురవేస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచారని చెప్పిన బీజేపీ, ఇప్పుడు ఎంత పెంచిందో చూడండి. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని ఎర్రబెల్లి మండిపడ్డారు.

Read also : HCU : 2,328 సీట్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ.. వివరాలు:

Click on your DTH Provider to Add TV9 Telugu