Etela Rajender: నోరు జారిన బీజేపీ నేత ఈటల రాజేందర్… ఏమన్నారో తెలుసా..!

పార్టీలు మారిన సమయంలో కొన్నిచమత్కారాలు.. విచిత్రాలు జరుగుతుంటాయి. పాత పార్టీకి జై కొట్టడం.. కొత్తగా చేరిన పార్టీని విమర్శించుకోవడం.. ఆ తర్వాత నోరు జారి..

Etela Rajender: నోరు జారిన బీజేపీ నేత ఈటల రాజేందర్... ఏమన్నారో తెలుసా..!
Etela Rajender
Sanjay Kasula

|

Jun 20, 2021 | 1:04 PM

పార్టీలు మారిన సమయంలో కొన్నిచమత్కారాలు.. విచిత్రాలు జరుగుతుంటాయి. పాత పార్టీకి జై కొట్టడం.. కొత్తగా చేరిన పార్టీని విమర్శించుకోవడం.. ఆ తర్వాత నోరు జారి.. నాలుక కరుచుకోవడం సహజంగా జరుగుతుంది. అలవాటులో పొరపాటులా ఇలాంటి వింతలు చోటు చేసుకుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే తాజా రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ పార్టీ నుంచి బీజేపీలో పెద్ద సంచలనంగా మారింది. ఇందులో భాగంగా ఆయన తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

సాధారణంగా పార్టీ మారిన కొత్తలో నేతలు నోరు జారుతుండడం సహజమే. అలాగే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా పొరపాటున నోరు జారారు. హుజురాబాద్‌లో ఎగరబోయేది గులాబి జెండా అని అనేశారు. అంతలోనే తన పొరపాటును గుర్తించి కాషాయ జెండా ఎగరబోతోందని సవరించారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని  వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు.

ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ముఖ్యమని… కులమతాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే అని స్పష్టం చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు.  తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి : AP POLICE: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు

 Vaccination Sunday: ఏపీలో ఇవాళ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్

CM KCR tour: ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు శ్రీకారం

Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి పెంపుడు కుక్క మృతి.. ట్వీట్ చేసిన బైడెన్‌ దంపతులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu