AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vantara: వంతారాకు ఐరాస సంస్థ ‘సైట్స్’ ప్రశంసలు

జంతు సంరక్షణకు భారతదేశం చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసల వర్షం కురిపించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో, వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.

Vantara: వంతారాకు ఐరాస సంస్థ ‘సైట్స్’ ప్రశంసలు
Vantara
Anand T
|

Updated on: Nov 04, 2025 | 6:09 PM

Share

జంతు సంరక్షణకు భారతదేశం చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసల వర్షం కురిపించింది.  ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ ప్రశంలను జోడించింది. ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపింది. రాబోయే 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరగనుంది.

Vantara 2

వంతారాపై ఐరాసా ప్రశంసలు

సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ, అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. “ఈ కేంద్రాలు Appendix-I జాబితాలో ఉన్న జంతువులను కూడా సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనడంలో తమకు ఎటువంటి సందేహం లేదని తెలిపింది.

Vantara

అంతేకాకుండా, వంతారా సంస్థలు అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ పేర్కొంది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ చెప్పుకొచ్చింది. ఇక్కడ భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది.

Untitled 1

జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు జరగలేదని పేర్కొంది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.

Vantara 1

ఇటీవలే వంతారాను సందర్శించిన ప్రధాని మోదీ

ఇదిలా ఉండగా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతారాను సందర్శించారు. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3,500 ఎకరాల్లో ఉన్న వణ్యప్రాణుల అంకితమైన వంతారా ప్రాజెక్టును అనంత్ అంబానీ స్థాపించారు.ఇక్కడ గాయపడిన, అంతరించిపోతున్న జంతువులకు చికిత్స చేసి వాటిని మళ్లీ అడవిలో వదిపెట్టేందుకు కృషి చేస్తారు.

Modi

మరిన్ని జాతీయ వార్తల కోసంఇ క్కడ క్లిక్ చేయండి.