Forced Conversions: సరిహద్దు గ్రామాల్లో బలవంతపు మతమార్పిడీలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న అకల్ తఖ్త్..
Christian Missionaries: పంజాబ్‌లో మరో ఆందోళన మొదలైంది. రైతు ఆందోళనలకుతోడు పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో భారీగా మత మార్పిడీలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి
పంజాబ్‌లో మరో ఆందోళన మొదలైంది. రైతు ఆందోళనలకుతోడు పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో భారీగా మత మార్పిడీలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్కడివారి అమాయకత్వం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరగా చేసుకుని తమ మార్పిడీ సాగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో బలవంతంగా మత మార్పిడి కోసం క్రైస్తవ మిషనరీలు ప్రచారం చేస్తున్నారని అకల్ తఖ్త్ జతేదార్ జియాని హర్‌ప్రీత్ సింగ్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) కూడా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ మిషనరీలు సరిహద్దు ప్రాంతాలలో బలవంతపు మతమార్పిడి కోసం ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. మత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు సిక్కు సమాజంలో అత్యున్నత స్థాయి గురుద్వారా ప్రధాన పూజారి అయిన అకల్ తఖ్త్ జతేదార్ ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను మోసగించి మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి ప్రలోభ పెట్టి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి చాలా ఫిర్యాదులు తమకు వచ్చయని ఆయన తెలిపారు.
జియాని హర్‌ప్రీత్ సింగ్ దళిత సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. అమృత్‌సర్‌లోని దళిత , సిక్కు సంస్థలు దళిత సిక్కుల హక్కుల పునరుద్ధరణ.. 101 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణ దేవాలయం , అకల్ తఖ్త్‌లో ఉచిత ప్రవేశాన్ని చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. బలవంతపు మతమార్పిడులను ఎదుర్కోవడానికి శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ‘ప్రతి ఇంట్లో ధర్మశాల’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. మార్పిడి అనేది సిక్కు మతంపై ప్రమాదకరమైన దాడి అని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా సిక్కు మత బోధకులు తమ మతానికి సంబంధించిన సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి గ్రామాలను వెళ్తారని అన్నారు.
అందుకే దళితులు లక్ష్యంగా మారారు
మతం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం అని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. బలవంతపు మార్పిడి లేదా బలవంతం ఎప్పటికీ సమర్థించబడదన్నారు. బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా ప్రచారాన్ని బలోపేతం చేయడంలో సిక్కులందరూ తప్పనిసరిగా SGPC కి మద్దతు ఇవ్వాలన్నారు. మనం ఇప్పుడు మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. SGPC ప్రచారం భారతదేశమంతటా నిర్వహించబడాలని గురుద్వారా తర్వాత సిక్కులకు సూచించారు. ముందుగా తాము ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నామని.. ఆ తర్వాత దేశం మొత్తం ఫోకస్ పెడుతున్నట్లుగా జాతేదార్ ప్రకటించారు.
అయితే జాతేదార్ ప్రకటనపై డాక్టర్ కాశ్మీర్ సింగ్ స్పందిస్తూ.. ఇలా మారడానికి అనేక కారణాలు ఉండవచ్చని. వాటిలో ఒక కారణం దళితులలో నిరక్షరాస్యత , పేదరికం, దీని కారణంగా వారు సులభంగా లక్ష్యంగా మారుతున్నారని వెల్లడించారు. మతం మారిన వారిని విదేశాలలో స్థిరపడటానికి తాము సహాయపడతారని ఆశ చూపిస్తున్నారని తెలిపారు. అమృత్‌సర్‌లో నివసిస్తున్న కాశ్మీర్ సింగ్.. దళిత, పంజాబ్ మైనారిటీ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు.
ఇలా చాలా చేయాల్సి ఉంది
అటువంటి మతమార్పిడులను ఆపడానికి మాకు దళిత సంఘం నుండి SGPC ప్రచారకులు, SGPC , దాని సంస్థలలో ఎక్కువ దళిత ప్రాతినిధ్యం అవసరం అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న అకల్ తఖ్త్ జతేదార్ ఒక దళిత సిక్కు అని సింగ్ అన్నారు. SGPC లో దళిత సిక్కులను కీలక స్థానాలకు నియమించాలని.. ఏ వివక్షకు వ్యతిరేకంగా అకల్ తఖ్త్ నుండి కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. SGPC కింద అన్ని విద్యా, వృత్తి విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..