ప్రాణాలతో ఆడుకోవద్దు.. పరీక్షలను వాయిదా వేయండి

సుప్రీం తీర్పుతో ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ), నీట్‌ ( NEET )లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ

ప్రాణాలతో ఆడుకోవద్దు.. పరీక్షలను వాయిదా వేయండి
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 5:25 PM

Postpone JEE and NEET: సుప్రీం తీర్పుతో ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ), నీట్‌ ( NEET )లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్‌సైట్‌లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది. జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది.

అయితే కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడకండి అంటూ వారు గళం విప్పుతున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ పరీక్షలను వాయిదా వేయాలంటూ చిన్నపాటి ఉద్యమం జరుగుతోంది. ఇక వారికి పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు కేంద్రాన్ని కోరుతున్నారు.

Read More:

కరోనా మరణాలను తగ్గిస్తోన్న ‘బీపీ మందులు’

కరోనా రోగుల కోసం పోలీసుల సాహసం.. ఏపీ డీజీపీ ప్రశంసలు