China:మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్న చైనా.. ఐరాసలో లష్కర్‌ ఉగ్రవాదికి అండగా నిలిచిన డ్రాగన్‌

గత నాలుగు నెలల్లో చైనా నాలుగోసారి ఓ ఉగ్రవాదికి మద్దతుగా నిలిచింది. చైనాకు మూడోసారి అధ్యక్షునిగా కొనసాగనున్న జిన్‌పింగ్‌ పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చాటుకున్నారు.

China:మరోసారి కుటిల బుద్ధిని చాటుకున్న చైనా.. ఐరాసలో లష్కర్‌ ఉగ్రవాదికి అండగా నిలిచిన డ్రాగన్‌
China President Xi Jinpin
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2022 | 9:16 AM

ఉగ్రవాదంపై పోరు విషయంలో డ్రాగన్‌ దేశం తన ద్వంద్వ ప్రమాణాలను మరోసారి బయట పెట్టుకుంది. పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రయత్నాలను తన వీటో పవర్‌తో అడ్డుకుంది. సమితిలోని ‘ అల్‌ఖైదా ఆంక్షల కమిటీ’ సమావేశంలో భారత్‌, అమెరికా షాహిద్ మహమూద్‌ అంశాన్ని ప్రస్థావించాయి. ఈ ఉగ్రవాదిపై ఆంక్షలు విధించాలని సభ్య దేశాలను కోరాయి. చైనా ఎప్పటిలాగే ఈ ప్రయత్నాలను అడ్డుకుంది. దీంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయింది. భారత్‌ వ్యతిరేక వైఖరి కారణంగానే పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా ఈ విధంగా వ్యవహరించిందనేది బహిరంగ రహస్యం. గత నాలుగు నెలల్లో చైనా నాలుగోసారి ఓ ఉగ్రవాదికి మద్దతుగా నిలిచింది. చైనాకు మూడోసారి అధ్యక్షునిగా కొనసాగనున్న జిన్‌పింగ్‌ పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చాటుకున్నారు.

కాగా షాషిద్‌ మహమూద్‌ 2007 నుంచి లష్కరే తోయిబాలో పని చేస్తున్నాడు.. పాకిస్తాన్‌లో కరాచీ కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌లో కొనసాగాడు.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా పని చేశాడు. షాషిద్‌ మహమూద్‌ మరో ఉగ్రవాది సాజిద్‌ మీర్‌తో కలిసి సిరియా, టర్కీ, బంగ్లాదేశ్‌, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్‌ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.ఈ నేపథ్యంలోనే షాహిద్ మహమూద్​ను అమెరికా 2016లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..