AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: కుక్కల దాడిలో చిన్నారి మృతి.. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన తండ్రి

దేశంలోని పలు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాడులు చేస్తూ తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు కుక్కకాటుకు బలై చనిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఓ ఘటన జరిగింది.

Delhi: కుక్కల దాడిలో చిన్నారి మృతి.. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన తండ్రి
Stray Dogs
Balu Jajala
|

Updated on: Mar 03, 2024 | 7:20 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాడులు చేస్తూ తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు కుక్కకాటుకు బలై చనిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఓ ఘటన జరిగింది. అయితే తుగ్లక్ లేన్ లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధి కుక్కల గుంపు దాడి చేసి కరవడంతో ఏడాదిన్నర బాలిక తండ్రి రూ.50 లక్షల పరిహారం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ మార్చి 4న జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ముందు విచారణకు రానుంది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు త్వరితగతిన అమలయ్యేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ)లను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్డీఎంసీ నిర్లక్ష్యం, పరిపాలనా లోపం కారణంగా తన ఏడాదిన్నర కుమార్తెపై కుక్కలు కిరాతకంగా దాడి చేసి, నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లి, చంపాయని పిటిషనర్ రాహుల్ కనౌజియా తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎన్డీఎంసీ ఇలాంటి నిర్లక్ష్య, పాలనాపరమైన తప్పిదం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలి అనే వాదనలు వినిపించాయి.  ఈ ఘటన ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం చోటుచేసుకుంది. చిన్నారి ఇంటి బయట కూర్చొని ఉండగా నాలుగైదు కుక్కలు చిన్నారిపై దాడి చేసి కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలోని ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో కుక్క కాటు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ