Aadhaar Card: ఆధార్‌లో చిన్నారి పేరును చూసి షాకైన ఉపాధ్యాయులు.. పాఠశాలలో అడ్మిషన్ కోసం నిరాకరణ
Aadhaar Card: ఆధార్ కార్డులు పేరు సరిగ్గా నమోదు చేసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నింటికి ఆధారే ముఖ్యం. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్..

Aadhaar Card: ఆధార్ కార్డులు పేరు సరిగ్గా నమోదు చేసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నింటికి ఆధారే ముఖ్యం. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ (Aadhaar) ఒకటి. ఇది అన్నింటికి ఉపయోగపడేది. అందుకే ఆధార్ కార్డులో పేరు, చిరునామా,ఇతర వివరాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డులో ఓ చిన్నారి పేరు (Name) వెరైటీగా ఉండటంతో ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు. చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు వెళ్లగా, అక్కడి ఉపాధ్యాయులు చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బెల్సి తహశీల్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్ అనే వ్యక్తి తన కుమార్తెను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేందుకు వెళ్లగా, అక్కడి ఉపాధ్యాయులు చిన్నారి ఆధార్ కార్డును చూసి అవాక్కైయ్యారు. ఆధార్ కార్డులో బాలిక పేరు స్థానంలో ‘మధుకా పాంచ్వా బచ్చా’ అని హిందీలో ఉండగా, ‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ అని ఇంగ్లీష్‌లో ఉండటమే సమస్యగా మారింది. అంతేకాదు.. ఆ కార్డుపై నంబర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించారు. ఆధార్‌పై పేరు విచిత్రంగా ఉండటంతో పాఠశాలలో ప్రవేశం కోసం నిరాకరించిన ఉపాధ్యాయులు.. కార్డలో పేరు మార్పు చేసుకోవాలని దినేష్‌కు సూచించినట్లు తెలిపారు.
స్పందించిన కలెక్టర్..
కార్డులో పేరు విచిత్రంగా ఉండటంపై కలెక్టర్ దీపా రంజన్ దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించారు. ఆధార్ కార్డులు పోస్టాఫీసులు, బ్యాంకుల్లో నమోదవుతున్నాయని.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని తలిపారు. బ్యాంకు, పోస్టాఫీసులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. ఇలా పొరపాటు జరిగినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
