AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

AP, Telangana Weather Update: గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నమోదవుతుంది. ఓ వైపు మాడు పగిలే ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు పిడుగులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినలో కారణంగానే ఇలాంటి విచిత్ర వాతావరణం నమోదవుతున్నట్టు అధికారలు అంచనా వేస్తున్నారు.

Weather Alert: తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
Ap, Telangana Weather Updat
Anand T
|

Updated on: Apr 20, 2026 | 8:00 AM

Share

సోమవారం హైదరాబాద్: తెలంగాణగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో రికార్డు స్థాయిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిర అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లోనే ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పస్టం చేసింది. కొన్ని జిల్లాలో ఈ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరగొచ్చని తెలిపింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిని తెలిపింది.

ఇది కూడా చదవండి: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ,17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: మీరు పడుకునే విధానమనే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?

అలాగే శ్రీకాకుళంలో ఒకటి, విజయనగరంలో 7, మన్యంలో ఒకటి, పోలవరంలో నాలుగు, అనకాపల్లి లో ఒకటి, తూర్పుగోదావరిలో 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని.. మరోవైపు ద్రోణి ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చూసించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!
మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే..
మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే..