AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వారిని ఆర్థికంగా ఎదిగేలా తోడ్పడేందుకు వారు ఎంచుకున్న రంగంలో పెట్టుబడి పెట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. స్త్రీనిధి లోన్స్‌ కింద డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలికి ఎలాంటి షూరిటీ లేకుండా సుమారుగా రూ.2లక్షల వరకు 11 శాతం వడ్డీతో లోన్స్ అందించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తాన్ని జస్ట్ 48 గంటల్లోనే అకౌంట్లో జమ చేయనుంది.

మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు
Stree Nidhi Scheme
Anand T
|

Updated on: Apr 20, 2026 | 6:50 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల ఆర్థిక ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకోంటోంది. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎంచుకున్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రూ.లక్ష వరకు ఆర్థిక సాయాన్ని అందింస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తాన్ని రెండు లక్షలకు పెంచింది. పారిశ్రామివేత్తలుగా ఎదగాలనుకుంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్త్రీ నిధి కింద సంఘాల్లోని ఒక్కో మహిళకు ఎలాంటి షూరిటీ లేకుండా గరిష్టంగా 11 శాతం వడ్డీతో రూ.2లక్షల వరకు రుణాలు అందించనుంది. ఈ మొత్తాన్ని కేవలం ధరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయనుంది. 2026-27 సంవత్సరంలో సుమారు 1.50 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనుకున్న ప్రభుత్వం ఈ మేరకు రూ 3 వేల కోట్లు వరకు ఖర్చు చేయనుంది.

అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ పరిధిలో సుమారు 8.43 లక్షల సంఘాలు ఉండగా అందులో 85.75 లక్షల మంది సభ్యులున్నారు. ప్రస్తుతం వీరిలో స్త్రీనిధి ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ. 1 లక్ష వరకు రుణం లభిస్తుంది. కానీ, వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు అదనంగా మరో రూ. 2 లక్షలు కలిపి, మొత్తం రూ. 3 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందజేందుకు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. గతంలో తీసుకున్న రుణాలను, వాయిదాలను సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

ఎస్సీ, ఎస్టీలకు అదనపు ప్రోత్సాహం

ఇక డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. దళిత, గిరిజన మహిళలకు మరింత ప్రోత్సాహం అందించేలా ‘ఉన్నతి’ పథకం కింద మరో రూ. 1 లక్ష వరకు ఎలాంటి వడ్డీ లేకుండా అదనపు రుణాలు అందించనున్నారు. అంటే వీరికి మొత్తం రూ. 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. అవసరమైతే అన్ని వర్గాల మహిళలకు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కింద మరో రూ. 1 లక్ష అదనంగా పొందే అవకాశం కూడా ఉంది.

ఎంపిక ప్రక్రియ

అయితే ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు సెర్ప్ అధికారులు ప్రతి సంఘాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తారు. ప్రతి గ్రామ సమాఖ్య పరిధిలో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు లేదా కొత్తగా ప్రారంభించాలనుకునే వారిని గుర్తించి, ప్రతి వీవో నుంచి 15 మందిని ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us