శంఖు పూలు విరగభూయాలా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

Samatha

19 April 2026

శంఖపూల గురించి అందరికీ తెలుసు. చాలా మంది తమ ఇంటిలో మొక్కను నాటుకుంటారు, ఇది ఆరోగ్యపరంగా , వాస్తు పరంగా కలిసి వస్తుంది.

శంఖుపూలు

అయితే శంఖు పూల చెట్టు నిండా పూలు ఉంటే ఆ మొక్కకు, ఇంటికి అందం వస్తుంది. అయితే సమ్మర్‌లో కూడా శంఖు పూలు ఫుల్‌గా పూయాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలంట.

చిట్కాలు

కాగా, ఇప్పుడు మనం శంఖు పూలు విరగభూయాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం, పదండి.

ఎలాంటి టిప్స్ అంటే?

శంఖు పూలు బాగా పూయాలి అంటే తప్పకుండా దానికి ఎరువులు ఉండాలి. చెట్టుకు సహజ ఎరువులు వేయడం వలన త్వరగా పూస్తాయి.

సహజ ఎరువులు

అయితే శంఖు పూల చెట్టుకోసం సహజ ఎరువును ఎలా తయారు చేయాలో చూద్దాం, టీ పొడి, అరటి తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు వీటన్నింటిని కలిపి ఎండబెట్టి పౌడర్‌లా తయారు చేసుకోవాలి.

ఎరువు తయారీ

ఒక వేళ ఇలా సహజ ఎరువు తయారు చేసుకోక పోయినప్పటికీ, తప్పకుండా ప్రతి రోజూ టీ పౌడర్ వేయాలి. దీంతో మొక్క దృఢంగా ఉంటుంది.

టీ పౌడర్ తప్పనిసరి

క్రమం తప్పకుండా వేగంగా పెరుగుతున్న శంఖు పూల మొక్కను కట్ చేయాలి. దీని వలన కొత్త కొమ్మలు వచ్చి, ఎక్కువ పూలు పూస్తాయి.

కత్తిరింపులు

అదే విధంగా ఈ మొక్కకు నీరు కూడా చాలా వరకు అవసరమే కాబట్టి ప్రతి రోజూ తగినంత నీరు పోయాలి. ఇలా చేయడం వలన చెట్టు నిండా పూలు పూస్తాయి

నీరు పోయడం