చింతచిగురు పచ్చడి.. ఇలా చేసి తింటే ఇంక మాటలుండవు.. ప్లేట్స్ లాగించాడాలే ఉంటాయ్
Chinthachiguru pachadi recipe in Telugu: చింత చిగురు పచ్చడిని ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినే వాళ్ళు ఇప్పుడు అంటే అందరూ నాన్ వెజ్ మీద పడ్డారు దీనిని ఎక్కువగా పాత కాలంలో తినే వాళ్ళు. మీరు ఒకసారి తింటే మళ్లీ మళ్ళీ తింటారు. దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Chintaku Pachadi
- కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు చింతచిగురు, రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, మూడు ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు,రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు , కరివేపాకు ఆకులు తీసుకోవాలి.
- ముందుగా పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆ తర్వాత చింతచిగురు కూడా వేసి బంగారు కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా చేస్తే పులుపు కూడా కొద్దిగా తగ్గుతుంది.
- ఇక ఇప్పుడు మళ్ళీ అదే పాన్ తీసుకుని దానిలో పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని బాగా వేయించాలి.
- ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో లేదా రోటిలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా దీనిలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇంకా దీనిని పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. చివర్లో తాలింపు పెట్టి ఈ పచ్చడిపై వేయాలి.
- రోటిలో రుబ్బితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనిలో నూనె కొంచెం వేస్తే మూడు రోజుల పాటు నిల్వ బాగుంటుంది. ఈ చింతచిగురు ఉల్లి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.
Follow Us





