AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: అదృష్టం అంటే వీళ్లదే.. రెండేళ్లకే 1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. 24న బోనస్ ట్రేడింగ్!

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లోని స్మాల్ క్యాప్ విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్న వేగా జువెలర్స్ లిమిటెడ్ (Vega Jewellers Limited) తన ఇన్వెస్టర్లకు మరో తీపి కబురు అందించింది. జువెలరీ రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా బోనస్ షేర్లను ప్రకటించి అందరి..

Multibagger: అదృష్టం అంటే వీళ్లదే.. రెండేళ్లకే 1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. 24న బోనస్ ట్రేడింగ్!
Multibagger Stock
Subhash Goud
|

Updated on: Apr 20, 2026 | 8:50 AM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లోని స్మాల్ క్యాప్ విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్న వేగా జువెలర్స్ లిమిటెడ్ (Vega Jewellers Limited) తన ఇన్వెస్టర్లకు మరో తీపి కబురు అందించింది. జువెలరీ రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా 4:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. బోనస్ షేర్ల వివరాలను అందించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం, రికార్డు తేదీ నాటికి మీ దగ్గర ఒక షేరు ఉంటే, అదనంగా 4 బోనస్ షేర్లు లభిస్తాయి. బోనస్ నిష్పత్తి: 4:1 (ప్రతి 1 షేరుకు 4 ఉచిత షేర్లు). రికార్డ్ డేట్: ఏప్రిల్ 24, 2026. ఒకవేళ మీరు 100 షేర్లు కలిగి ఉంటే బోనస్ తర్వాత మీ ఖాతాలో మొత్తం 500 షేర్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: Personal Loan: మీరు ఏడాది కాలానికి 1 లక్ష రూపాయల పర్సనల్‌ లోన్ తీసుకుంటే నెలకు EMI ఎంత? వడ్డీ?

రెండేళ్లలో కళ్లు చెదిరే లాభాలు:

ఈ స్టాక్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 17,442 శాతం లాభాన్ని అందించి అసలైన మల్టీబ్యాగర్‌గా నిలిచింది. రెండేళ్ల క్రితం ఎవరైనా ఈ షేరులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే నేడు దాని విలువ సుమారు రూ. 1.75 కోట్లు అయ్యేది. గత ఏడాది కాలంలోనే ఈ షేరు 560 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ప్రకారం.. గత శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు రూ. 312.25 వద్ద ముగిసి, తన 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. 52 వారాల గరిష్ఠ ధర: రూ. 312.25, 52 వారాల కనిష్ఠ ధర: రూ. 46.36, మార్కెట్ క్యాప్: సుమారు రూ. 317.75 కోట్లు.

ఇవి కూడా చదవండి

ఇన్వెస్టర్లు గమనించాల్సింది:

ఏప్రిల్ 24వ తేదీన ఈ స్టాక్ ఎక్స్ బోనస్ ట్రేడింగ్ నిర్వహించనుంది.  అంటే, బోనస్ ప్రయోజనం పొందాలనుకునే వారు ఈ లోపే షేర్లను కొనుగోలు చేసి ఉండాలి.

గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. గతంలో వచ్చిన లాభాలు భవిష్యత్తులోనూ వస్తాయని చెప్పలేము. అందుకే పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Aadhaar Card Alert: మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా