AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా..

బెజవాడలో ఎండలంటే.. అది సాధారణ వేడి కాదు, ఒక్క అడుగు బయట పెట్టాలంటేనే గుండె దడ పెంచే స్థాయి, ఉదయం సూర్యుడు కాస్త వెలిగినా సరే.. మధ్యాహ్నానికి వచ్చేసరికి నగరం మొత్తం అగ్ని గోళంలా మారిపోతుంది. రోడ్లపై నుంచి ఎగిసే ఎండ మంటలు, వేడి అలలు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రజలు అందరూ ఇంటికే పరిమితం అయిపోతున్నారు.

M Sivakumar
| Edited By: |

Updated on: Apr 20, 2026 | 8:22 AM

Share
కానీ,ఈ మండుతున్న ఎండలతో పోరాడేందుకు విజయవాడ నగరం ఓ కొత్త ఆయుధాన్ని రంగంలోకి దించింది. అదే మిస్ట్ వెహికిల్స్ చూడటానికి ఇవి సాధారణ వాహనాల్లా కనిపించినా,పని మాత్రం అసాధారణం. అచ్చం యుద్ధరంగంలోకి దూసుకెళ్లే యంత్రాల్లా ఇవి రోడ్లపైకి వచ్చి సూర్యుడి తాపాన్ని తగ్గించేందుకు ఓ యుద్ధాన్ని ప్రారంభించాయి. నగరంలోని ప్రధాన రహదారులపై తిరుగుతూ ఈ వాహనాలు గాలిలోకి అతి సూక్ష్మమైన నీటి బిందువులను చిమ్ముతాయి. ఈ చిన్న చిన్న నీటి కణాలు గాలిలోని వేడిని వెంటనే గ్రహించి ఆవిరైపోతాయి. దాంతో చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా కొద్దిగా పడిపోతుంది.

1 / 5
ఎండలో ప్రయాణించే వాహనదారులకు, పాద చారులకు ఇది ఒక చిన్న రిలీఫ్, కానీ చాలా విలువైన ఉపశమనం. ఒక్కసారి నీటితో నింపితే దాదాపు 6 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ వాహనాలు సుమారు 18 కిలోమీటర్ల వరకు చల్లదనాన్ని పంచగలవు. సాధారణంగా వాడే నీటి ట్యాంకర్లతో పోలిస్తే ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. నీటిని వృథా కాకుండా దాదాపు 90 శాతం వరకు ఆదా చేస్తూ, అవసరమైన చోటే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇంతటితో ఆగిపోలేదు,ఈ మిస్ట్ వెహికిల్స్ మరో ముఖ్యమైన పని కూడా చేస్తున్నాయి. గాలిలో తేలియాడే కాలుష్య కణాలను తగ్గించడం. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన PM 2.5, PM 10 వంటి సూక్ష్మ కణాలను నియంత్రించడం ద్వారా నగర గాలి నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి.

2 / 5
ఎండల కారణంగా రోడ్లు విపరీతంగా వేడెక్కి హీట్ ఐలాండ్ ప్రభావం కనిపించే నగరాల్లో ఈ తరహా టెక్నాలజీ చాలా అవసరం. ఈ వాహనాల్లోని హై ప్రెషర్ పంపులు నీటిని సూక్ష్మ బిందువులుగా మార్చి గాలిలోకి పంపడం వల్ల అవి వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి.

3 / 5
ఫలితంగా పరిసరాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రోడ్డు డివైడర్లలో ఉన్న మొక్కలకు కూడా ఇవి ప్రాణం పోస్తున్నాయి. సాధారణంగా పోసే నీటితో పోలిస్తే,ఈ మిస్ట్ వల్ల ఆకులపై పేరుకుపోయిన ధూళి తొలగిపోతోంది. దీంతో మొక్కలు సజీవంగా ఉండి, కిరణ జన్య సంయోగం సరిగా జరగడానికి సహకరిస్తోంది.

4 / 5
విజయవాడ నగర పాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ మిస్ట్ వెహికిల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రధాన రోడ్లపై వీటిని నడిపిస్తూ ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఈ చర్యపై నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొత్తానికి,మండుతున్న ఎండల మధ్యలో ఒక చల్లని ప్రయత్నంగా ఈ మిస్ట్ వెహికిల్స్ నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టి, నగరంలోని అంతర్గత రహదారుల వరకు ఈ సేవలను విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

5 / 5
Follow Us
3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. 5 జట్ల మధ్య కీలక పోరు..!

మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా

TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!

ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..

CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!

కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!

సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు