AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Live: వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో

PM Modi Live: వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: May 10, 2026 | 3:45 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. బీజేపీ ఎంపీలతో పాటు నేతలు మోదీకి వెల్‌కమ్‌ చెప్పారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా.. 9వేల 377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి, ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇళ్లకు వెళ్లనున్నారు.

ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఒక్కసారి చూద్దాం…

జహీరాబాద్‌లో 2వేల 360 కోట్ల రూపాయల విలువైన ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు

జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా 3,175 కోట్ల రూపాయలతో గుడెబల్లూర్‌- మహబూబ్‌నగర్‌ –వరకు హైవే పనులకు శంకుస్థాపన చేస్తారు.

వరంగల్‌లో 1,695కోట్ల రూపాయల విలువైన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

హైదరాబాద్‌ సమీపంలోని మల్కాపూర్‌లో 611 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ POLను ప్రారంభిస్తారు.

1,243 కోట్ల రూపాయల విలువైన 118 కిలోమీటర్ల కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టు..

292 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్ల నిర్మించనున్న కాజీపేట రైల్‌ అండ్‌ రైల్‌ బైపాస్‌ రైల్వే లైనుకు శంకుస్థాపన చేస్తారు.

Published on: May 10, 2026 03:17 PM
Follow Us