AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరోలకే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇంటి బాత్రూంలో నోట్ల కట్టలు.. ఆ ఒక్క అబద్ధం చెప్పడంతో దెబ్బకు కెరీర్ నాశనం..

ఒకప్పుడు ఆమె అభిమానుల కలల రాణి. సహజ సౌందర్యం, అభినయంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. అప్పట్లో స్టార్ హీరోలకే గట్టిపోటీ ఇచ్చింది. కానీ ఊహించని సంఘటన ఆమె జీవితాన్ని మలుపులు తిప్పింది. అప్పటివరకు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. తన తండ్రి మాటను విని చెప్పిన ఒక్క అబద్ధం ఆమె కెరీర్ నాశనం చేసింది.

Tollywood : స్టార్ హీరోలకే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇంటి బాత్రూంలో నోట్ల కట్టలు.. ఆ ఒక్క అబద్ధం చెప్పడంతో దెబ్బకు కెరీర్ నాశనం..
Mala Sinha
Rajitha Chanti
|

Updated on: May 10, 2026 | 3:08 PM

Share

50, 60వ దశకాలలో, హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె అగ్రకథానాయిక. దాదాపుగా నిర్మాతలందరి మొదటి ఎంపికగా ఉండే హీరోయిన్ ఆమె. తన కెరీర్‌లో రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, మనోజ్ కుమార్ వంటి దిగ్గజ నటులతో తెర పంచుకుని పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ఆ నటి అందం, ఆకర్షణీయమైన రూపం, బలమైన నటన అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఆ నటి మరెవరో కాదు, ‘పర్వరిష్’, ‘బాద్షా’, ‘నయా జమానా’, ‘ధూల్ కా ఫూల్’ వంటి చిత్రాలలో నటించిన మాలా సిన్హా. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆమె నటించిన ‘ఆప్కీ నజరోం నే సజా, ప్యార్ కే కాబిల్ ముఝే’ అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది. అప్పట్లో ఆమె కలల రాణి. కోట్లాది అభిమానుల హృదయాలు గెలుచుకుంది. కానీ ఒక వివాదంలో ఆమె పేరు చిక్కుకోవడంతో, ఆమె కెరీర్ మొత్తం నాశనమైంది. మాలా ఎంతో డబ్బు సంపాదించింది కూడా, కానీ ఒకరోజు అదే డబ్బు కారణంగా వివాదంలో చిక్కుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

కానీఆమె చాలా పిసినారి..ఇంట్లో పనిమనిషిని పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అయ్యేదని ఇంట్లో పనులు కూడా తానే స్వయంగా చేసుకునేది. ఒకసారి, ముంబైలోని మాలా సిన్హా ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. అప్పుడు, ఆమె ఇంట్లోని బాత్రూంలో ఏకంగా రూ.12 లక్షల నగదు దొరికింది. ఆ రోజుల్లో రూ.12 లక్షలు చాలా పెద్ద మొత్తం. ఈ విషయం కోర్టుకు చేరింది. వివాదాస్పద పరిస్థితిలో చిక్కుకున్న మాలా సిన్హా, కోర్టులో చేసిన ఒక్క మాటతో ఆమె కెరీర్ నాశనమైంది. ఆ డబ్బు అంతా తాను సినిమాల ద్వారానే కాకుండా వ్యభిచారం ద్వారా సంపాదించానని తెలిపింది. దీంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా షాకయ్యింది. ఈ ఘటన ఆమె వ్యక్తిగత ప్రతిష్టను ,సినీ కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

తన తండ్రి, లాయర్ల సలహా మేరకు, ఆ డబ్బును పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆమె కోర్టులో ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ డబ్బును తాను వేశ్యావృత్తి ద్వారా సంపాదించానని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ద్వారా సంపాదించానని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అలా చెబితే అది వ్యక్తిగత సంపాదన కిందకు వస్తుందని, సినిమా ద్వారా వచ్చిన నల్లధనం కాదని నిరూపించి డబ్బును తిరిగి పొందవచ్చని ఆమె భావించారు. ఆ మాట చెప్పకపోయి ఉంటే తన డబ్బు మొత్తం కోల్పోయేది. కానీడబ్బు సంపాదన గురించి ఆమె చెసిన మాటలు కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆమె ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక అగ్రశ్రేణి నటి తన నోటితోనే అటువంటి మాట అనడం ఆమె అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాత్రికి రాత్రే ఆమె ఇమేజ్ పాడైపోయింది. నిర్మాతలు, దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వడం నిలిపివేశారు. అనేక పెద్ద ప్రాజెక్టుల నుండి ఆమెను తొలగించారు. తోటి నటీనటులు ఆమెతో పనిచేయడానికి ఆసక్తి చూపలేదు. దీనివల్ల ఆమె కెరీర్ ఒక్కసారిగా ముగిసిపోయింది

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు