Hyderabad: రన్నింగ్‌లో ఉండగా మంటలు.. చూస్తుండగానే కాలిపోయిన కాస్ట్‌లీ కార్!
హైదరాబాద్ కొత్తగూడ ప్రాంతంలో ఓ మెర్సిడెస్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో కొత్తగూడలోని ఎస్‌ఎల్‌ఎన్‌టీ సమీపంలో ఈ ఘటన జరిగింది
హైదరాబాద్ కొత్తగూడ ప్రాంతంలో ఓ మెర్సిడెస్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో కొత్తగూడలోని ఎస్‌ఎల్‌ఎన్‌టీ సమీపంలో ఈ ఘటన జరిగింది. మెర్సిడెస్ బెంజ్ ఈ 300 కారు నడుపుతున్న మొయిజ్ (28) అనే యువకుడు బంజారాహిల్స్ నుంచి వసెల్లా మెడోస్ వైపు వెళ్తుండగా వాహనం నుంచి ముందుగా పొగలు వచ్చాయి. వెంటనే కారును ఆపి బయటకు దిగగా కొద్ది సేపటికే కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయానికి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కానీ కారు మొత్త పూర్తిగా కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో క్రెయిన్ సహాయంతో కారును తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

