AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Swearing: విజయ్ అనే నేను.. తమిళనాడు కొత్త సీఎంగా టీవీకే చీఫ్ ప్రమాణస్వీకారం

తమిళ రాజకీయాల్లో కొత్తశకం మొదలైంది. ఏళ్లనాటి ద్రవీడియన్‌ పాలనకు స్వస్తి చెప్పి.. తమిళనాడు కొత్త అధినేతగా, సీఎంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తోపాటు 9 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ సహా రాష్ట్ర మాజీ సీఎంలు, సినీ తారలు హాజరయ్యారు.

Vijay Swearing: విజయ్ అనే నేను.. తమిళనాడు కొత్త సీఎంగా టీవీకే చీఫ్ ప్రమాణస్వీకారం
Joseph Vijay Sworn In As Cm
Anand T
|

Updated on: May 10, 2026 | 3:21 PM

Share

తమిళ రాజకీయాల్లో కొత్తశకం మొదలైంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తమిళనాడులో కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ నిర్మాణాన్ని సమర్థవంతంగా బద్దలుకొట్టి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీవీకే పార్టీ. ఏళ్ల నాటి చరిత్రను తిరగరాస్తూ పార్టీ అధినేత విజయ్ రాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విజయ్‌ చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు.  ఇక సీఎం తర్వాత 9 మంది టీవీకే ఎమ్మెల్యే రాష్ట్ర నతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

అయితే విజయ్ కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ఈ టీవీకే ఎమ్మెల్యేలంతా విజయ్ కొత్త కేబినెట్‌లో ఉండనున్నారు. వారిలో  ఆధవ్‌ అర్జున, సెంగోట్టియాన్‌, బుస్సీ ఆనంద్‌, అరుణ్‌ రాజ్‌, S.కీర్తన, వెంకట్రామన్‌, నిర్మల్‌ కుమార్‌, రాజమోహన్‌, టీకే ప్రభు ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు మాజీ సీఎంలు స్టాలిన్‌, పళనిస్వామి , సినీ తారలు హాజరయ్యారు.

తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన పదవీకాలం అత్యంత విశిష్టంగా సాగాలని కొరుకుంటున్నట్టు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాలలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చెన్నై మున్సిపల్‌ కార్పోరేషన్ అధికారులు. మెరీనా బీచ్, బేసెంట్ నగర్ బీచ్, అన్నానగర్ టవర్ పార్క్, సెంట్రల్, CMBT, సెమ్మొళి పొంగ, కతిపార జంక్షన్‌లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

విజయ్ ప్రమాణస్వీకారం లైవ్‌ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు