CJI NV Ramana: ‘తక్షణ న్యాయం’పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
నేపథ్యంలో తీర్పు ఇవ్వడం అంత తేలికైన పని కాదన్నారు సీజేఐ. ‘తక్షణ న్యాయం’ కోసం పెరుగుతున్న డిమాండ్ మధ్య ‘నిజమైన న్యాయం’ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
CJI NV Ramana on Instant Justice: దేశంలోని కోర్టుల్లో కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్య చాలాసార్లు వచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక ప్రకటన చేశారు. చెన్నైలో శనివారం జరిగిన మద్రాసు హైకోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఇన్‌స్టంట్ నూడుల్స్ యుగంలో ప్రజలకు తక్షణ న్యాయం జరుగుతుందని అశిస్తున్నారని, అది నిజమైన న్యాయానికి హాని కలిగిస్తుందన్నారు.
చెన్నైలో మద్రాస్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని నమక్కల్, విల్లుపురం జిల్లాల్లో కోర్టు భవనాలను సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సెటైరికల్‌గా చెప్పారు. నేటి ఇన్‌స్టంట్ నూడుల్స్ కాలంలో న్యాయాన్ని కూడా ఇన్‌స్టంట్‌గానే ప్రజలు ఆశిస్తున్నారన్నారు సీజేఐ. అయితే తక్షణ న్యాయం కోసం ప్రయత్నిస్తే, నిజమైన న్యాయానికి నష్టం జరుగుతుందన్నది ప్రజలు గుర్తించడం లేదన్నారు. కేసు ఏదైనా లోతుగా దర్యాప్తు చేయాల్సిందేనన్నారు. ప్రపంచం వేగంగా కదులుతున్నందున, తక్షణ సంతృప్తి, తక్షణ అవసరం ప్రతి రంగానికి చేరిందని చెప్పారు.
అయితే న్యాయ వ్యవస్థతో సహా అన్ని సంస్థలను ప్రభావితం చేసే అతిపెద్ద సమస్య స్థిరమైన విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు ఇవ్వడం అంత తేలికైన పని కాదన్నారు సీజేఐ. ‘తక్షణ న్యాయం’ కోసం పెరుగుతున్న డిమాండ్ మధ్య ‘నిజమైన న్యాయం’ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు బృహత్తరమైన రాజ్యాంగ బాధ్యత ఉందని సీజేఐ చెప్పారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన రోజునే ఈ బాధ్యతను తీసుకుంటారని గుర్తు చేశారు. సామాజిక వాస్తవాలపైనా న్యాయమూర్తులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే మారుతున్న సామాజిక అవసరాలు, అంచనాలను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. అవసరమైనప్పుడు కోర్టులు, న్యాయవాదులు స్థానిక భాషలు వినియోగించడాన్ని సమర్థించారు. సీజేఐ. కేసు కొనసాగుతున్న తీరును కక్షిదారులు సరిగా అర్థం చేసుకునేందుకు ఇది అవసరమని చెప్పారు. మనకు అర్థం కాని పెళ్లిలో మంత్రాల మాదిరిగా ఇది ఉండకూడదన్నారు.
సీజేఐ తన పదవీ కాలంలో శాంతిభద్రతలను ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించారు. CJIగా పనిచేసిన గత ఏడాది కాలంలో, భారతదేశంలోని మన న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే అనేక సమస్యలను నేను హైలైట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో న్యాయవ్యవస్థతో సహా అన్ని సంస్థలను ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సమస్య ప్రజల దృష్టిలో స్థిరమైన నమ్మకాన్ని నిర్ధారించడమన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి కూడా రాజ్యాంగ విలువలను సమర్థించడం, అమలు చేయడం న్యాయవ్యవస్థ విధి అని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. “న్యాయవ్యవస్థ చట్టం పాలనను సమర్థించడం,కార్యనిర్వాహక, శాసనపరమైన అన్యాయాలను పరిశోధించే గొప్ప రాజ్యాంగ బాధ్యతతో ఉనికిలో ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం, అమలు చేయడం మన కర్తవ్యం. నిస్సందేహంగా, ఇది భారీ భారం. మన రాజ్యాంగ ప్రమాణం చేసిన రోజు, మేము దీన్ని సంతోషంగా ఎంచుకున్నాము. అందుకే న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడమే నా ప్రథమ ప్రాధాన్యత. న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అవసరం, ఇది చట్టబద్ధమైన పాలన కోసం నిలుస్తుంది.” అని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
Read Also… RBI Fines Bank: కస్టమర్‌కు సకాలంలో డబ్బు చెల్లించని బ్యాంక్.. భారీ జరిమానా విధించిన RBI..