AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవి పంది దాడి నుంచి కుమార్తెను కాపాడుకున్న తల్లి.. చివరకు మిగిలింది విషాదమే..!

క్రూర మృగాల దాడి కింద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని పాసన్ అటవీ రేంజ్ అధికారి తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కింద తొలుత రూ.25,000 చెల్లిస్తామని, అన్ని ఫార్మాటీలు ముగిసిన అనంతరం మిగతా రూ.5.75 లక్షలు అందజేస్తామని వెల్లడించారు.

అడవి పంది దాడి నుంచి కుమార్తెను కాపాడుకున్న తల్లి.. చివరకు మిగిలింది విషాదమే..!
Wild Boar
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2023 | 8:57 PM

Share

ఓ తల్లి తన బిడ్డ కోసం ఏదైనా, ఎంతటి సాహసానికైన సిద్ధపడుతుందని తెలుసు. పిల్లలకు ఏదైనా అపాయం వస్తుందని తెలిస్తే.. ఆమె మరణంతో కూడా పోరాడగలదు. ఈ కథ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మరోమారు నిజమైంది. ఇక్కడ ఓ తల్లి తన 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు మృత్యువుతో పోరాడింది. ఆమె కుమార్తెపై ఒక అడవి పంది దాడి చేసింది..దాంతో ఆ తల్లి అడవి పందిని ఎదిరించి తన కూతుర్ని కాపాడుకుంది. అయితే అడవి పందితో పోరాడే క్రమంలో ఆమె మరణించింది. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని పాసన్ పోలీస్ స్టేషన్ పరిధి తెలియమార్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల దువాషియా బాయి, ఆదివారం 11 ఏళ్ల కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో మట్టి తీసే పనులు చేస్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవిపంది ఆమె కుమార్తెపై దాడి చేయబోయింది. అది గమనించిన దువాషియా బాయి వెంటనే తన చేతిలో ఉన్న గొడ్డలితో ప్రతిఘటించింది. ఆ అడవి పందితో తీవ్రంగా పోరాడింది. దీంతో అది చనిపోయింది. కాగా, అడవి పందితో పోరాటంలో తీవ్రంగా గాయపడిన దువాషియా బాయి కూడా చనిపోయింది.

గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రూర మృగాల దాడి కింద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని పాసన్ అటవీ రేంజ్ అధికారి రామ్‌నివాస్ దహయత్ తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కింద తొలుత రూ.25,000 చెల్లిస్తామని, అన్ని ఫార్మాటీలు ముగిసిన అనంతరం మిగతా రూ.5.75 లక్షలు అందజేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం