- Telugu News Photo Gallery Karnataka newest airport inaugurated by pm modi in shivamogga, key things to know Telugu News
Karnataka: శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..? అందరికీ చేరువలో ..
కర్ణాటకలో కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ ఎయిర్‌పోర్టు రాకతో శివమొగ్గతో పాటు చిక్కమంగళూరు, హసన్ జిల్లాలకు కనెక్టివిటీ పెరుగనుంది.
Updated on: Feb 27, 2023 | 7:52 PM

శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. విమానాశ్రయాన్ని ఆకాశం నుంచి చూస్తే తామరపువ్వు ఆకారంలో అందంగా కనిపిస్తుంది.

ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణికులను తట్టుకోగలదు. ఇది ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్’.

కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద శివమొగ్గ జిల్లాలోని సోగానే వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలకే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించినట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

శివమొగ్గ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా కనెక్టివిటీ, పర్యాటకాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతగానో దోహదపడుతుంది.

ఇది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న మొదటి విమానాశ్రయం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

ఈ విమానాశ్రయం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.





























