Chhattisgarh: నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్, 3 మహిళా నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలు లభ్యం

నారాయణపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి గురించి సైనికులకు సమాచారం అందింది. ఆ తర్వాత అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారం సరైనదని తేలింది. ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఆయుధాలతో సంచరిస్తూ కనిపించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సైనికులకు ఎటువంటి హాని జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు.

Chhattisgarh: నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్, 3 మహిళా నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలు లభ్యం
Female Naxalites Killed
Follow us

|

Updated on: Aug 29, 2024 | 6:18 PM

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మళ్ళీ తుపాకులు మ్రోగాయి. ముగ్గురు మహిళా నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా తెలియజేశారు. హతమైన మహిళా నక్సలైట్ల నుంచి అనేక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం సంఘటనా స్థలం సమీప ప్రాంతలో సైనికుల బృందం పెట్రోలింగ్‌లో ఉంది. ఈ సమయంలో సైనికులు ముగ్గురు మహిళా నక్సలైట్‌లను చూశారు. ఈ సందర్భంగా సైనికులకు, నక్సలైట్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్స్ అక్కడికక్కడే మరణించారు.

నారాయణపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి గురించి సైనికులకు సమాచారం అందింది. ఆ తర్వాత అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారం సరైనదని తేలింది. ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఆయుధాలతో సంచరిస్తూ కనిపించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సైనికులకు ఎటువంటి హాని జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు.

యూనిఫాంలో ఉన్న మహిళా నక్సలైట్

ఇవి కూడా చదవండి

నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మద్‌లో హతమైన మహిళా నక్సలైట్లు యూనిఫాం ధరించి ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం సైనికులు ఆ ప్రాంతానికి వెళ్లగా, నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. అనంతరం సైనికులు ప్రతీకార చర్యలు చేపట్టారు. చాలా సేపు అడపాదడపా కాల్పులు జరిగాయి, తరువాత ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లు చేసేందుకు వెళ్లిన బృందాల్లో (DRG), STF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది ఉన్నారు. మరికొందరు నక్సలైట్ల కోసం కూడా గాలిస్తున్నారు. నక్సలైట్ల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా ఒక భారీ ప్రకటన చేశారు. 2025 నాటికి దేశం నుంచి నక్సలైట్లను అంతమొందిస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
ఇన్నాళ్ల తర్వాత కవితను చూసి కేసీఆర్ రియాక్షన్ ఇదే.. వీడియో
ఇన్నాళ్ల తర్వాత కవితను చూసి కేసీఆర్ రియాక్షన్ ఇదే.. వీడియో
సింక్ హోల్స్.. మనుషుల ప్రాణాలను మింగేస్తాయి
సింక్ హోల్స్.. మనుషుల ప్రాణాలను మింగేస్తాయి