Viral: డబ్బే.. డబ్బు.. బ్యాంకు అకౌంట్లలోకి కుప్పలు.. తెప్పలుగా డబ్బు.. ఏకంగా కోట్లలో
ఒక్కసారిగా మీ అకౌంట్లలో కోట్లలో అమౌంట్ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తే మీకు ఎలా ఉంటుంది. అస్సలు ఆ ఫీలింగ్ వర్ణించడమే కష్టం. అయితే తాజాగా చెన్నైలోని కొందరి వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమైంది.

అడక్కుండానే బ్యాంక్ అకౌంట్లలో కోట్లలో డబ్బు వచ్చి ఎలా ఉంటుంది. ఆ ఆశ్చర్యాన్ని.. ఆనందాన్ని అస్సలు వర్ణించలేం. ఎలా జరుగుతోందో.. ఏమో తెలియదు కాని.. కొన్ని అకౌంట్లలో కోట్లకు కోట్లు డబ్బు జమైంది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నై(Chennai)కి చెందిన కొంత మంది బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక్కో HDFC అకౌంట్‌లో ఒకే సారి 13 కోట్ల 50 లక్షలు వచ్చి పడ్డాయి. ఇలా దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు పడ్డాయి. మెసేజ్ చూసుకున్న ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇది నిజమేనా అని అనకుంటూ కొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకున్నారు.. మరికొందరు బ్యాంక్ యాప్‌లో క్రాస్ చెక్ చేశారు. ఖాతాల్లో కోట్లలో బ్యాలెన్స్ చూపించడంతో.. ఎగిరి గంతేశారు. ఒకే సారి కోట్లు వచ్చి పడడంతో ఇంకొందరు కంగారు పడి బ్యాంకుకు పరుగులు తీశారు. అటు.. మరికొంత మంది ఖాతాదారుల్లో 10 వేల నుంచి 50 లక్షల వరకు డిపాజిట్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న చెన్నైలోని బర్కిట్ రోడ్ బ్రాంచ్ బ్యాంక్ అధికారులు అలర్ట్ అయ్యారు. దాదాపు వంద ఖాతాలను హోల్డ్ చేశారు. అప్పటికే కొందరు డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో.. ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
