ఢిల్లీ శివార్లలో కదం తొక్కిన అన్నదాతలు, పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని దూసుకుపోయిన రైతులు
భారత 72 వ గణ తంత్ర దినోత్సవం నాడు దేశం ఘనంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్న వేళ..మంగళవారం ఢిల్లీ శివార్లలో అన్నదాతలు కదం తొక్కారు..
భారత 72 వ గణ తంత్ర దినోత్సవం నాడు దేశం ఘనంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్న వేళ..మంగళవారం ఢిల్లీ శివార్లలో అన్నదాతలు కదం తొక్కారు. సుమారు 5 వేలమందికి పైగా రైతులు పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని దూసుకుపోయారు. పరేడ్ కార్యక్రమాలు ముగిసిన అనంతరం తాము ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేసినప్పటికీ దానికి ముందుగానే సుమారు 8 గంటల ప్రాంతంలో వారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సుమారు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. కాగా సింఘు, టిక్రి బోర్డర్లలో రైతులు పోలీసులతో దాదాపు ఘర్షణ పడ్డారు. భారీ సంఖ్యలో ఉన్న వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు.శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘాలు పేర్కొన్నప్పటికీ ఆ దాఖలాలు కనబడలేదు.
ఒకవైపు ఇండియా గణ తంత్ర దినోత్సవం సందర్భంగా తన ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్న వేళ మరోవైపు అన్నదాతల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది.