AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: కోడ్‌ భాషలో మతమార్పిడీలు…తవ్వేకొద్దీ సంచలన విషయాలు… పాక్‌, అరబ్‌ దేశాల నుంచి నిధుల వరద

మతమార్పిడి కేసులో అరెస్టయిన చెంగూర్ బాబా కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విదేశాల నుంచి సొమ్ములు పోగేసి.. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్‌ అలియస్‌ చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్‌ ఖాతాలపై...

Uttar Pradesh: కోడ్‌ భాషలో మతమార్పిడీలు...తవ్వేకొద్దీ సంచలన విషయాలు... పాక్‌, అరబ్‌ దేశాల నుంచి నిధుల వరద
Changur Baba
K Sammaiah
|

Updated on: Jul 14, 2025 | 6:48 AM

Share

మతమార్పిడి కేసులో అరెస్టయిన చెంగూర్ బాబా కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విదేశాల నుంచి సొమ్ములు పోగేసి.. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్‌ అలియస్‌ చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్‌ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. మరో 18 అకౌంట్ల సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిల్లో దాదాపు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటికి గత మూడు నెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్‌వర్క్‌లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు.

జలాలుద్దీన్‌ మతమార్పిడుల రాకెట్‌ను నిర్వహించే క్రమంలో కోడ్‌ భాషను ఉపయోగించేవాడు. యూపీ ఏటీఎస్‌ దీనిని ఛేదించింది. చంగూర్‌ బృందం టార్గెట్ చేసిన మహిళలను ‘ప్రాజెక్ట్‌’ అని.. మతమార్పిడిని ‘మిట్టీ పలట్నా’ అని.. మహిళలను మభ్యపెట్టడాన్ని ‘కాజల్‌ కర్నా’ అని, జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని ‘దీదార్‌’ అని వ్యవహరించేవాడు. చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్‌ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్‌, నేపాల్‌లో 100 వరకు ఖాతాలున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్లలో చెంగూర్ బాబాకి రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా…దానిలో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం నేపాల్‌ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంగూర్‌ బాబాకు సంబంధించి బలరామ్‌పుర్‌లోని భారీ ఇంటిని ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. ఈ భవనంలో దాదాపు 70 గదులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిల్లో 40ని కూలగొట్టారు. చంగూర్‌బాబా 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.