Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ పేమెంట్స్ నిర్వహణలో భారత్ టాప్.. నగదు బదిలీల్లో విఫలమవుతున్న ఇతర దేశాలు..

ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా..

UPI Payments: యూపీఐ పేమెంట్స్ నిర్వహణలో భారత్ టాప్.. నగదు బదిలీల్లో విఫలమవుతున్న ఇతర దేశాలు..
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 01, 2022 | 12:34 PM

UPI Payments: ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రజా ధనం వృధా కాకుండా ఉండటానికి డిజిటల్ ఇండియా పేరిట ఓ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా దేశంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిని నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో జమచేస్తుంది. ఈపథకం విజయవంతం అవ్వడంతో పాటు.. దీని ద్వారా ప్రతి రూపాయి పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారుడుకి చేరుతుంది. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం చేయడం ద్వారానే ఈ డైరెక్ట్ బెనిపిట్ ట్రాన్స్ ఫర్ విజయవంతమైంది. ముందుగా దేశంలో ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జనధన్ యోజన పేరుతో ఒక రూపాయి కూడా లేకుండా ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిచే పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో దేశంలో బ్యాంకు ఖాతాలేని గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం బ్యాకింగ్ రంగం సేవలకు దగ్గరయ్యారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకం విజయవంతమవ్వడానికి ప్రధానమంత్రి జనధన్ యోజన ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత కీలక పాత్ర పోషించింది యునిఫైడ్ పేమెంట్స్ సర్వీసెస్ (UPI) దీనినే తెలుగులో ఏకీకృత చెల్లింపుల సేవగా పిలుస్తారు.

2016 ఏప్రియల్ లో యూపీఐ సేవలు దేశంలో ప్రారంభమయ్యాయి. ఈసేవల ప్రారంభంతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎవరి బ్యాంకు ఖాతాలో అయినా డబ్బులు జమచేయాలంటే బ్యాంకులకు వెళ్లి బారీ క్యూలో నిల్చోవల్సి వచ్చేది కాని ఇప్పుడు అలా కాదు. ఎవరి బ్యాంకు ఖాతాలోకైనా వారి అకౌంట్ నెంబర్ కు మెబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు సెకన్లలో యూపీఐ సిస్టమ్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. అదికూడా మనం ఎవరికి బదిలీ చేయాలనుకుంటే వారికే. ఇందులో మోసాలకు అవకాశం లేదు. మనం మెబైల్ నెంబర్ తప్పు ఎంటర్ చేస్తే తప్ప… పొరపాటు జరిగే అవకాశం లేదు. ఈ UPI విధానం దేశంలో ఎంతో విజయవంతంగా నడుస్తోంది. ఈవిధానం ద్వారా బ్యాంకులపై కూడా ఎంతో ఒత్తిడి తగ్గింది.

UPI అనేది డిజిటల్ చెల్లింపు గేట్‌వే సిస్టమ్, దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈవిధానం నియంత్రించబడుతుంది. ప్రస్తుతం 30 దేశాలకు పైగా ఈవిధానాన్ని అమలుచేస్తున్నాయి. భారత్ అభివృద్ధి చేసిన ఈవిధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈవిధానం విజయవంతం కావడంతో అకౌంట్ నెంబర్ కు మెబైల్ నెంబర్, ఆధార్ సంఖ్య జతకావడంతో ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమచేయడం సలభం అవుతుంది. క్షణాల వ్యవధిలో రూపాయి కూడా పక్కదారిపట్టకుండా 100 శాతం నిజమైన లబ్ధిదారుడికి చేరుతుంది. మరోవైపు UPI ద్వారా రికార్డు స్థాయిలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. టీ స్టాల్ మొదలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వరకు ప్రతి ఒక్కరూ UPI పేమెంట్స్ సిస్టమ్ కు అనుసంధానమయ్యాయి.

ఇవి కూడా చదవండి

జేబులో ఒక్కరూపాయి లేకపోయినా.. ఈ UPI ద్వారా జస్ట్ ఫోన్ లో యూపీఐ విధానానికి సంబంధించి ఏ యాప్ అయినా ఓపెన్ చేసి చాలా ఈజీగా స్కాన్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఏకకాలంలో లావాదేవీలు జరపవచ్చు. ఇది ఎంతో సురక్షితం.

130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో ప్రభుత్వ పథకాల లబ్ధిని లబ్ధిదారుల ఖాతాల్లో క్షణాల్లో జమచేస్తుంటే 8కోట్ల మంది జనాభా ఉన్న జర్మనీలో ఏదైనా ఒక పథకానికి సంబంధించిన లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా బదిలీ చేయడానికి 18 నెలల సమయం పడుతుంది. రోజుకు కేవలం లక్ష మందికి మాత్రమే ఈపథకాన్ని చేరవేయగలుగుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్ నెంబర్ ను గుర్తించి.. దానిని వెరీఫై చేసుకోవడం వల్ల ఎంతో సమయం వృధా అవుతుంది. కాని 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో యూపీఐ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతా నెంబర్ ను క్షణాల్లో ధృవీకరించుకుని బ్యాంకు అకౌంట్ కు తక్షణమే నగదు బదిలీ అవుతుంది. భారత్ లో విజయవంతమైన ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకాన్ని ఎన్నో దేశాలు ఎడాప్ట్ చేసుకుంటున్నాయి. నగదు రహిత లావాదేవీల వైపు దేశం పయనిస్తోంది. ఈవిధానాన్ని భారత్ నుంచి ఇతర దేశాలు అలవాటుచేసుకుంటున్నాయి. డిజిటల్ ఇండియా ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు రాగలిగాయి. అలాగే దేశ ఆర్థిక వృద్ధికి UPI విధానం దోహదపడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..