Jammu Kashmir: కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. భయం గుప్పిట్లో స్థానికులు

ప్రశాంత వాతావరణం, మంచు కొండల చల్లదనంతో భూలోక స్వర్గంగా విరాజిల్లుతోన్న జ‌మ్ము క‌శ్మీర్‌లో (Jammu and Kashmir) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో..

Jammu Kashmir: కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. భయం గుప్పిట్లో స్థానికులు
Jammu And Kashmir
Follow us

|

Updated on: Sep 01, 2022 | 12:07 PM

ప్రశాంత వాతావరణం, మంచు కొండల చల్లదనంతో భూలోక స్వర్గంగా విరాజిల్లుతోన్న జ‌మ్ము క‌శ్మీర్‌లో (Jammu and Kashmir) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ (Sopor) ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత గాలింపు చేపట్టాయి. సోపోర్‌ టౌన్‌లోని బొమై ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో రక్షణ కోసం భద్రతా బలగాలు ఇద్దరిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారు జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన మహ్మద్‌ రఫి, కైసర్‌ ఆశ్రఫ్‌గా గుర్తించారు. మరో ఘటనలో సోపియాన్ జిల్లాలోని న‌క్బాల్‌ ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారిని లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు.

కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు అమరుడయ్యారు. చనిపోయిన ముష్కరులు పాకిస్థాన్​కు చెందిన జైషే మహ్మద్​ సంస్థకు చెందిన వారని నిర్ధరించారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద ఎన్​కౌంటర్​ జరిగింది. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో గాయపడి, ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!