AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Politics: శాఖ మార్చిన కొద్దిసేపటికే మంత్రి పదవికి రాజీనామా.. అసలు ఏం జరిగిందంటే..

బీహార్ న్యాయశాఖ మంత్రి, ఆర్జేడీ నేత కార్తీక్ కుమార్ ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడంతో విపక్ష బీజేపీ పెద్ద ఎత్తున..

Bihar Politics: శాఖ మార్చిన కొద్దిసేపటికే మంత్రి పదవికి రాజీనామా.. అసలు ఏం జరిగిందంటే..
Kartik Kumar
Amarnadh Daneti
|

Updated on: Sep 01, 2022 | 11:09 AM

Share

Bihar Politics: బీహార్ న్యాయశాఖ మంత్రి, ఆర్జేడీ నేత కార్తీక్ కుమార్ ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడంతో విపక్ష బీజేపీ పెద్ద ఎత్తున ఈఅంశంపై ఆందోళన చేపట్టింది. నితీష్ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి కిడ్నాప్ కేసులో నిందితుడు అంటూ నిరసనలు చేపట్టడం, ప్రజల్లోకి ఈవిషయాన్ని ప్రతిపక్ష బీజేపీ బలంగా తీసుకెళ్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రిమండలి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తొలుత మంత్రి పదవి మారుస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రి నుంచి చెరకు శాఖ మంత్రిగా మార్చారు. అయినప్పటికి.. విపక్షాల నుంచి నిరసనలు ఆగకపోవడంతో శాఖ మార్చిన కొద్దిసేపటికే కార్తీక్ కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాను గవర్నర్ సైతం ఆమోదించారు.

2014లో జరిగిన ఓ కిడ్నాప్‌ కేసులో మంత్రి కార్తీక్ కుమార్ నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్‌ కుమార్‌ను.. బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్‌ కుమార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్‌ కుమార్‌ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్‌ కుమార్‌ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అ‍ప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే