PM Modi: మీరు మారాలి.. లేదంటే మార్పు అనివార్యం.. ఎంపీలను హెచ్చరించిన ప్రధాని మోడీ..
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఎంపీల తీరుపై సీరియస్ అయ్యారు. తరచుగా సమావేశాలకు చాలామంది ఎంపీలు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల బాధ్యతలను..
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఎంపీల తీరుపై సీరియస్ అయ్యారు. తరచుగా సమావేశాలకు చాలామంది ఎంపీలు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల బాధ్యతలను గుర్తు చేస్తూ సభాకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. “మీరు మారాలి.. లేదంటే మార్పు అనివార్యమవుతుంది” అంటూ హెచ్చరించారు. ప్రజలకు చేరువ కావాలని, తమ తమ నియోజవర్గాల్లో ఈవెంట్లు నిర్వహించాలన్నారు. పద్మ అవార్డు గ్రహీతలను గౌరవించాలని ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. పద్దతి మార్చుకోవాలని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు మోదీ.
క్రమశిక్షణతో.. సమయపాలనతో మెలగాలని.. తమ పార్టీ ఎంపీలు, మంత్రులకు పదే పదే సూచించిన ప్రధాని.. తాజాగా బీజేపీ నేతలను ‘పిల్లల్లాగా’ ప్రవర్తిస్తున్నారని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. “దయచేసి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి. పిల్లల్లాగే దీని గురించి నేను నిరంతరం ఒత్తిడి చేయడం మంచిది కాదు. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే, తగిన సమయంలో మార్పులు వస్తాయి” అని ప్రధాన మంత్రి సుతి మెత్తగా వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా సీనియర్ మంత్రులు హాజరయ్యారు. వీరితోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల దృష్యా ప్రధాని తమ పార్టీ ఎంపీలను మందలించడం పార్టీ సమావేశాల్లో ప్రధాన చర్చకు దారి తీసింది.
నవంబర్ 15వ తేదీ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించినందుకు ఈ సమావేశంలో ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలియచేశారు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..
Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..