Tamilnadu: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్‌ఐ అఘాయిత్యం.. బలవంతంగా అబార్షన్‌ చేయించిన వైనం..

అతివలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన

Tamilnadu: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్‌ఐ అఘాయిత్యం..  బలవంతంగా అబార్షన్‌ చేయించిన వైనం..
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2021 | 12:26 PM

అతివలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌. ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఏకంగా అబార్షన్‌ కూడా చేయించాడు. ఈ అమానుషంపై సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఆ ఎస్‌ఐతో సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ మహిళ(32)కు వివాహమై 9 ఏళ్ల కూతురుంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అతను మోసగించడంతో పోలీసులను ఆశ్రయించింది.

కాగా భర్తపై ఫిర్యాదు చేసేందుకు పళుగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆమెను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుందర లింగం(40) కేసు పేరుతో ఆమెను పలు చోట్లకు తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని బాధితురాలిని సాధారణ వైద్య పరీక్షలని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్‌ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ఎస్‌ఐపై పలుమార్లు, వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగంతో పాటు మరో 8మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందులో ఆమెకు అబార్షన్‌ చేసిన వైద్యుడు కూడా ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మార్తాండం పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read:

Hyderabad: మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్.. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్

Liquor Smuggling: మద్యం బాటిళ్ల అక్రమ రవాణా.. పోలీసులకే దిమ్మదిరిగేలా స్మగ్లర్ల క్రియేటివిటీ.. వీడియో

Telangana: ఛాటింగ్‌తో ఛీటింగ్‌.. రూ.20 లక్షలు కాజేసిన మాయలేడి.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..