Hyderabad: మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్.. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్

Hyderabad: మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్.. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్
Drunk And Drive

Hyderabad Drunk and Drive Accident: హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ల పరంపర కొనసాగుతోంది. మందుబాబుల ఆగాడాలు ఆగడం లేదు.

Janardhan Veluru

|

Dec 07, 2021 | 12:15 PM

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ల పరంపర కొనసాగుతోంది. మందుబాబుల ఆగాడాలు ఆగడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహస్తున్న కానిస్టేబుల్ ను ఓ మందుబాబు ఇన్నోవా వాహనంతో ఢికొట్టాడు. కారు నడుపుతున్న మహ్మద్ అనే వ్యక్తి  మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి హైదరాబాద్ రానున్న నేపథ్యంలో పోలీసులు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎట్టకేలకు కదిలిన పోలీసులు..

హైదరాబాద్‌లో సోమవారంనాడు చోటు చేసుకున్న రెండు వేర్వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందడం తెలిసిందే. దీనిపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. వరుస కథనాల నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు కదిలారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదానికి కారణమైన రోహిత్ గౌడ్, సుమన్‌లను కోర్టుకు తరలించారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రాణాలు తీసింది ఆ ఇద్దరే అని తెలుసు. పూర్తిగా సాక్షాలు ఉన్నాయి. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిన్న తెల్లవారుజామున ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నా.. ఇప్పుడు కోర్టుకు తరలించారు.

నిందితులది హై ప్రొఫైల్ కావడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత తగ్గించాలని నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు సెక్షన్‌ల విషయంలో తాత్సారం ప్రదర్శిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.. రెండు రోజులు గడుస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

ప్రమాదాలకు కారణం ఎవరు?

హైదరబాద్ నగరంలో ప్రమాదాలకు బాధ్యులెవరు? నిత్యం రోడ్లపై జనాన్ని చంపుతున్నది ఎవరు? తాగుబోతుల నిషానే కారణమా? ఇందులో పోలీసుల బాధ్యత రాహిత్యం ఎంత? చలాన్స్ వసూలు చేయడంలో చూపి శ్రద్ధ.. రూల్స్ అమలు చేయడంలో పెట్టడం లేదా అంటే అవుననే అంటున్నాడు నగరవాసి. చలాన్లు వసూలు చేసేందుక పరిమితమౌతున్న ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ను కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలున్నాయి.

ట్రాఫిక్‌ కంట్రోలింగ్ పోలీసుల విధి. కాని రోజుకు ఎన్ని చలానాలు వేశావు? ఎంతమేర ఖజానాకు రాబడి తెచ్చావు అనేది వారి పనితీరుకు కొలమానంగా మారింది. కెమెరా పట్టుకొని వెహికిల్స్ ఫొటోలు తీయడంలో నిమగ్నమవుతున్న పోలీసులు ట్రాఫిక్‌ను గాలికి వదిలేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మందుబాబులు రోడ్డుపైకి రాకుండా కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నారు.

నగరంలో 340 చోట్ల ట్రాఫిక్‌ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రతి సిగ్నల్‌ దగ్గర కాకపోయినా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లలో పోలీసుల ఉంటే వాహనదారులకు కొంతైన భయం ఉంటుంది. హైదరాబాద్‌ సీపీగా మహేందర్‌రెడ్డి ఉన్నప్పుడు రాత్రి పదిగంటల వరకు ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై ఉండేవారు. కొంతమందిని రాత్రి 11 గంటల వరకు ఉంచేవారు. ఇప్పుడు రాత్రిపూట ఒక్కరంటే ఒక్కరూ కన్పించడంలేదు. నగరంలో 60 కిలో మీటర్ల వేగానికి మించి వెళ్లడానికి వీల్లేదు. ఎక్కడా ఈ నిబంధన పాటించడం లేదు. ఈ క్రమంలో చలాన్లపై పెట్టిన శ్రద్ధ.. ట్రాఫిక్‌ డ్రంకెన్ డ్రైవ్‌పై పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.

అమాయకుల ప్రాణాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెర్రరిస్టులు చెలగాటం..

ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా సుమారు 1500 డ్రంకన్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరిగితే… అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 400 ఉన్నాయ్. సైబరాబాద్‌లో 350, రాచకొండలో 150 నమోదయ్యాయి. ఇక, డెత్స్ చూస్తే, స్టేట్ వైడ్‌గా 457మంది అమాయకులు డ్రంకన్ డ్రైవ్ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో 189మంది, సైబరాబాద్‌లో 160మంది, రాచకొండలో 108మంది అన్యాయంగా బలైపోయారు.

Also Read..

Telangana: ఛాటింగ్‌తో ఛీటింగ్‌.. రూ.20 లక్షలు కాజేసిన మాయలేడి.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..

Car Accident: చివరి వరకు తోడుంటానని చెప్పి అప్పుడే వెళ్లిపోయావా.. భార్యను బతికించుకునేందుకు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu