Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య.. బతికించుకునేందుకు ఆయన చేసిన చివరి ప్రయత్నం..
కదలకుండా పడి ఉన్నా.. అతని ఆశలు మాత్రం అడుగంటిపోలేదు. అదే పనిగా తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేశాడు.. ఈ హృదయ విదారక ఘటన
SORROW ACCEDENT: కట్టుకున్న భార్య నిర్జీవంగా పడి ఉండటం.. వేగంగా అక్కడికి చేరుకున్న భర్త చలించిపోయాడు. భార్య బతికి ఉందేమోనని నాడి పట్టుకొని చూశాడు.. కదలకుండా పడి ఉన్నా.. అతని ఆశలు మాత్రం అడుగంటిపోలేదు. అదే పనిగా తట్టి లేపేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా ఆవిడ కదలలేదు. తన కళ్ల ముందే నిర్జీవంగా పడి వున్న భార్యను బ్రతికించు కోవడానికి ఆ భర్త చేసిన ప్రయత్నాలకు ఆ భగవంతుడు కరుణించ లేదు. దీంతో తాళి కట్టి తన చేతిలోనే కొన ఊపిరి విడిచిన ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది. అటుగా వెళ్తున్నవారంతా చూస్తూ ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలో ఉంటున్న సురేష్ చంద్రసామల్ దమన్ జోడిలోని నాల్కో కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
సొంత ఊరుకు తన ఇద్దరు పిల్లలను, భార్యతో వచ్చి.. కారులో తిరుగు ప్రయాణంలో చీపుర్లపాడు గ్రామం వద్ద వెనక నుంచి వస్తున్న కారుకు తోవ ఇచ్చే క్రమంలో ఎదురుగా పార్టింగ్ చేసి ఉన్న లారీని వారి కారు ఢీ కొనడంతో ఆయన భార్య తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి పోయింది. స్వల్ప గాయాలతో ఇద్దరు కూతుర్లు బైట పడ్డారు. తీవ్ర గాయాలతో నిర్జీవంగా రోడ్డుపై పడి ఉన్న తన భార్య బ్రతికి ఉందో లేదో అని ఆమె చేతి నాడిని పరీక్షించి.. శ్వేస ఆడుతుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేసిన భర్త చేతుల్లో ఆమె తుది శ్వాస వీడిచింది.
నూరేళ్ల పాటు తోడుగా ఉంటానని ఒక్కటైన ఆ దంపతుల ఒప్పందాన్ని రోడ్డు ప్రమాదం ఇలా విడదీసింది.. తన భార్యను బ్రతికించుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు చూసిన వారికి కంటతడి పెట్టించాయి. అనంతరం గాయపడిన ఇద్దరి కూతుళ్లను.. మృతి చెందిన భార్యను ఆసుపత్రికి తరలించారు. తోడుగా ఉండాల్సిన భార్య ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం భర్తకు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చేసింది. భార్యను అంత ప్రేమగా చూసే భర్తలు ఎంత మంది ఉంటారని ఈ ఘటనను చూసినవారు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..
Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..