Liquor Smuggling: మద్యం బాటిళ్ల అక్రమ రవాణా.. పోలీసులకే దిమ్మదిరిగేలా స్మగ్లర్ల క్రియేటివిటీ.. వీడియో

Liquor Smuggling in AP: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అక్రమార్కులు పలు మార్గాల్లో

Liquor Smuggling: మద్యం బాటిళ్ల అక్రమ రవాణా.. పోలీసులకే దిమ్మదిరిగేలా స్మగ్లర్ల క్రియేటివిటీ.. వీడియో
Illegal Liquor
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2021 | 12:11 PM

Liquor Smuggling in AP: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అక్రమార్కులు పలు మార్గాల్లో మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఏపీ పోలీసులు జరిపిన తనిఖీల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నిందితుల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు. ట్రాలీ ఆటోలో ప్రత్యేకంగా అరలు తయారు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు రెండు ట్రాలీ ఆటోలను ఆపి తనిఖీలు నిర్వహించగా.. వారి ప్లాన్ కాస్త రివర్స్ అయింది. ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న 400 మద్యం బాటిళ్లను జి.కొండూరు మండలంలోని కందులపాడు అడ్డరోడ్ వద్ద ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం నుంచి విజయవాడ కొత్తూరు తాడేపల్లికి అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా.. ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనుమానంతో రెండు ట్రాలీ ఆటోలను ఆపి పరిశీలించారు. ఆటో ట్రక్కులో ప్రత్యేకంగా అరను ఏర్పాటు చేసి కేటుగాళ్లు మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు ఆటో ట్రాలీలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వీడియో.. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. కొంతమంది అక్రమార్కులు తెలంగాణ, పలు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లను తరలించి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. అక్రమ మద్యంపై ఏపీ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో.. వారి ఐడియాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికే.. ఏపీలో కోట్లాది రూపాయల మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు

Car Accident: చివరి వరకు తోడుంటానని చెప్పి అప్పుడే వెళ్లిపోయావా.. భార్యను బతికించుకునేందుకు..