Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheddi Gang: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెచ్చిపోతున్న చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో ప్రజలు..

Cheddi Gang Hulchul in Vijayawada: చీక‌టి ప‌డితే చాలు చెడ్డీలు ధ‌రిస్తారు. చేతుల్లో మార‌ణాయుధాలు ప‌ట్టుకొని సంచరిస్తారు. అడ్డోస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు. అడ‌వాళ్లు క‌నిపిస్తే

Cheddi Gang: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెచ్చిపోతున్న చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో ప్రజలు..
Cheddi Gang
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2021 | 10:52 AM

Cheddi Gang Hulchul in Vijayawada: చీక‌టి ప‌డితే చాలు చెడ్డీలు ధ‌రిస్తారు. చేతుల్లో మార‌ణాయుధాలు ప‌ట్టుకొని సంచరిస్తారు. అడ్డోస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు. అడ‌వాళ్లు క‌నిపిస్తే అత్యాచారాలకు బరితెగిస్తారు. తాపీగా దొచుకొని అదే ఇంట్లో బోజ‌నం చేస్తారు. విన‌డానికే వ‌ణుకు పుట్టించే అ క‌రుడుగ‌ట్టిన చెడ్డీ గ్యాంగ్ మొన్నటి వరకూ హైదరాబాద్‌లో దడ పుట్టించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హడలెత్తిస్తోంది. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలను చడ్డి గ్యాంగ్ వణికిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు నమోదుకావండంతో ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శివారు ప్రాంతాల అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. విజయవాడ చిట్టినగర్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నగలు, నగదు దోపిడీ చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా తాడేపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు విల్లాలో చోరీలకు పాల్పడ్డారు. ఈ రెయిన్‌బో విల్లాలోనే ప్రముఖులు నివాసముంటున్నారు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే విల్లాలో చోరీ జరగడంతో కలకలం రేగుతోంది. అంతకుముందు పులివెందుల, తిరుపతి, ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురంలో దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముసుగులు ధరించి వస్తున్న ఈ దొంగల ముఠా ఖరీదైన వస్తువుల్ని దోచుకెళ్తున్నారు.

విజయవాడలో చెడ్డీ గ్యాంగ్‌ ముఠాలు రెచ్చిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్నీ చోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు చోట్ల ఒకే ముఠా పనేనా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. దీంతోపాటు శివారు ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ పెంచారు. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని చెడ్డీ గ్యాంగ్‌లను తలుచుకుని బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ చెడ్డీ గ్యాంగ్‌లకు వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Also Read:

Vijayawada: విజయవాడపై నీలి చిత్రాల నీడలు.. వెలుగులోకి కీలక విషయాలు.. మరో ఐదుగురిపై కేసు

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..