AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛాటింగ్‌తో ఛీటింగ్‌.. రూ.20 లక్షలు కాజేసిన మాయలేడి.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..

ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీలతో అకౌంట్లు ఓపెన్‌ చేసింది. తప్పుడు పేర్లతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా 20 మందికి వలవేసింది. వారి నుంచి రూ. 20 లక్షలు కాజేసింది..ఇది కరీంనగర్ లోని తిరుమలనగర్‌ కు చెందిన ఓ మాయలేడీ భాగోతం

Telangana: ఛాటింగ్‌తో ఛీటింగ్‌.. రూ.20 లక్షలు కాజేసిన మాయలేడి.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..
Basha Shek
|

Updated on: Dec 07, 2021 | 12:22 PM

Share

ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీలతో అకౌంట్లు ఓపెన్‌ చేసింది. తప్పుడు పేర్లతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా 20 మందికి వలవేసింది. వారి నుంచి రూ. 20 లక్షలు కాజేసింది..ఇది కరీంనగర్ లోని తిరుమలనగర్‌ కు చెందిన ఓ మాయలేడీ భాగోతం. పూర్తి వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా ధర్మపురి కి చెందిన ఓ మహిళ కరీంనగర్ లోని తిరుమలనగర్ లో నివాసముంటింది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో తాత్కాలిక ఉద్యోగిణిగా పని చేస్తోంది. ఇదివరకే ఆమెకు ఒకరితో పెళ్లైంది. అయితే భర్తతో విడాకులు తీసుకుంది. ఆపై రెండవ పెళ్లి చేసుకున్నా అదే తంతు.. అతనితోనూ తగవులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఈక్రమంలో పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదించుకునేందుకు టెక్నాలజీని మార్గంగా చేసుకుంది. నకిలీ పేర్లు, ఐడీలతో ఫేస్‌బుక్‌ అకౌంట్లు తెరచి అబ్బాయిలను వలలో వేసుకుంది. అబ్బాయిలకు.. అమ్మాయి ఫోటోలు.. అమ్మాయిలకు అబ్బాయి ఫొటోలు పంపి వారితో ఛాటింగ్ చేసేది. మిమిక్రీ ద్వారా గొంతుమార్చి అబ్బాయిల్లాగా కూడా మాట్లాడేది. వాటిని రికార్డ్‌ చేసి బాధితులను బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం మొదలు పెట్టింది.

ఇలా ఇప్పటివరకు 34 నకిలీ ఐడీలు సృష్టించిందీ మాయలేడి. 10 సిమ్ కార్డులను ఉపయోగించి.. 20 మంది యువతీ యువకులను మోసం చేసింది . కాగా ఇటీవల ఒక బాధితురాలు ఒక అబ్బాయి తనను మోసం చేశాడంటూ కరీంనగర్ షీ టీం పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో ఈ కిలేడీ భాగోతం. వెలుగులోకి వచ్చింది. కాగా ఈ కేసును మరింత లోతుగా విచారించాలని టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో మాయలేడీని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు తెలిశాయి..

Also Read:

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. విద్యుత్‌ కంచెలు తగిలి ఇద్దరి మృత్యువాత..

Cheddi Gang: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెచ్చిపోతున్న చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో ప్రజలు..

Students Missing: సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. నలుగు విద్యార్థుల అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?