Election Results: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీలకు షాకిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..!
Chandigarh Municipal Corporation Election Results 2021: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కు ముందు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ (APP)..
Chandigarh Municipal Corporation Election Results 2021: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కు ముందు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ (APP) అతిపెద్ద పార్టీగా అవతరించింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 2021 సోమవారం విడుదలయ్యాయి. 35 స్థానాలకు గాను 14 స్థానాలను ఆప్ గెలుచుకుంది. పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్ తన ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. చండీగఢ్ ఎన్నికలు పంజాబ్‌లో జరగబోయే మార్పునకు నిదర్శనమని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. మేయర్ రవికాంత్ శర్మ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కి నెట్టేసింది.
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆమ్ అద్మీ పార్టికి ఊపునిచ్చినట్లయ్యింది. అయితే పంజాబ్ సీఎంను మార్చాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. జాట్ సిక్కు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో దళిత సిక్కు చరణ్ జిత్ సింగ్ చన్నీని నియమించడం, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లుగా ఉంది.
ఈ ఫలితాల్లో ఆప్ 14 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 12 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 8 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం దక్కించుకుంది. చండీగఢ్ మున్సిపల్ ఫలితాలను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్రైలర్‌గా అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి: