AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: కాల్పుల ఘటనతో అసదుద్దీన్‌కు జెడ్ కేటగిరీ.. వెంటనే రంగంలోకి NSG కమాండోలు

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌పై దాడి తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ దాడికి మాస్టర్‌ మైండ్‌ ఎవరు..? అసదుద్దీన్‌పై అటాక్‌కు రీజనేంటి..? పక్కా ప్లాన్‌ ప్రకారమే ఎంపీపై అటాక్‌ జరిగిందా..? అన్న అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

Asaduddin Owaisi: కాల్పుల ఘటనతో అసదుద్దీన్‌కు జెడ్ కేటగిరీ.. వెంటనే రంగంలోకి NSG కమాండోలు
Asaduddin Owaisi
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2022 | 12:09 PM

Share

AIMIM Chief Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. అవును.. గురువారం కాల్పుల ఘటనతో అసదుద్దీన్‌కు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. CRPF జెడ్‌ కేటగిరీ భద్రతను అందిస్తోంది. వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది. Z కేటగిరీ(Z category security)లో ఉన్న వ్యక్తులకు 4-6 NSG కమాండోలు రక్షణ కల్పిస్తారు. మిగతా పోలీసు సిబ్బందితో కలుపుకుని మొత్తం 22 మంది సిబ్బంది రక్షణగా ఉంటారు. కాగా హైదరాబాద్‌ ఎంపీ(Hyderabad MP) అసదుద్దీన్‌పై దాడి తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ దాడికి మాస్టర్‌ మైండ్‌ ఎవరు..? అసదుద్దీన్‌పై అటాక్‌కు రీజనేంటి..? పక్కా ప్లాన్‌ ప్రకారమే ఎంపీపై అటాక్‌ జరిగిందా..? అన్న అంశాలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అసదుద్దీన్‌పై దాడి కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఐతే ఈ అటాక్‌కు ఒవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఐతే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఒవైసీ ప్రసంగాలే కారణమా..? ఇంకేదైనా కారణముందా..? అన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరోవైపు ఈ ఘటనను లోక్‌సభలో లేవనెత్తుతానని అంటున్నారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. ఒక ఎంపీపై దాడితో ఎలాంటి సందేశమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారాయన. ఇప్పటి వరకూ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. మొత్తం నలుగురు అసదుద్దీన్‌పై కాల్పులు జరిపారు. మరి మరో ఇద్దరు ఎక్కడ..? అసలు వాళ్ల టార్గెట్ ఏంటి? ఆయుధాలను అక్కడే వదిలి వెళ్లడానికి రీజన్సేంటి..? ఇప్పుడిదే దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: హైదరాబాద్‌లో హైఅలెర్ట్.. రంగంలోకి క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌