ULLU OTT: ఉల్లు లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ యాప్స్‌పై కేంద్రం సంచలన ఆదేశాలు
అశ్లీపై కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఉల్లు సహా 25 ఓటీటీలపై నిషేధం విధించింది. వెంటనే ఆ యాప్స్‌ను కనిపించడకుండా చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది. గతంలోనూ పలుమార్లు హెచ్చరించిన యాప్స్ తీరు మారకపోవడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఏ ఏ యాప్స్ నిషేధించారంటే..?

పోర్న్ వీడియోస్‌తో ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. పోర్న్ వీడియోలకు బానిసై ఇతరుల జీవితాలను చిదిమేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఎన్నో సైట్లను బ్యాన్ చేసింది. అయినా వాటికి అడ్డుకట్ట పడడం లేదు. అశ్లీల కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న పలు యాప్స్‌ను కేంద్రం నిషేధించింది. తాజాగా మరికొన్ని యాప్స్‌పై చర్యలకు దిగింది. ఉల్లు, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ సహా 25 ఓటీటీ యాప్స్‌ను కేంద్రం నిషేధించింది. ఆ యాప్స్‌ను తొలగించాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది. సదరు యాప్స్ అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని.. గతంలోనే పలు మార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేవని కేంద్రం తెలిపింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ ప్రొవైడర్లు సైత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉల్లు, ఏఎల్టీటీ సహా పలు యాప్స్‌లో ప్రసారమవుతున్న అసభ్య కంటెంట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానరం ఆదేశించింది. ఈ నేపథ్యంలో 25 ఓటీటీలను కేంద్రం నిషేధించింది. అశ్లీల కంటెంట్‌ను సహించేది లేదని.. ఎవరైన ప్రసారం చేస్తే తగిన చర్యలు తీసకుంటామని కేంద్రం హెచ్చరించింది.
నిషేధించిన యాప్స్ ఇవే..
ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్, కంగన్ , బుల్, జల్వా, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్ఎక్స్ విఐపి, ఫుగి, మోజ్‌ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




