AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Apps: లోన్‌ యాప్స్‌ ఆగడాలకు కళ్లెం.. గూగుల్ సాయం కోరుతూ కేంద్రం, ఆర్‌బీఐ కీలక నిర్ణయం..!

భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌ను కట్టడి చేసేందుకు తమకు సాయపడాలని టెక్‌ దిగ్గజం గూగూల్‌ను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోరాయి. అక్రమ లోన్‌ యాప్స్‌ విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి.

Loan Apps: లోన్‌ యాప్స్‌ ఆగడాలకు కళ్లెం.. గూగుల్ సాయం కోరుతూ కేంద్రం, ఆర్‌బీఐ కీలక నిర్ణయం..!
Loan Apps
Shaik Madar Saheb
|

Updated on: Sep 20, 2022 | 6:34 AM

Share

Illegal lending apps: భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌ను కట్టడి చేసేందుకు తమకు సాయపడాలని టెక్‌ దిగ్గజం గూగూల్‌ను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోరాయి. అక్రమ లోన్‌ యాప్స్‌ విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ప్లేస్టోర్స్‌లోనే కాదు వెబ్‌సైట్స్‌, ఇతర మార్గాల ద్వారా కూడా ఇలాంటి అక్రమ యాప్స్‌ పెచ్చరిల్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి RBI పరిధిలోకి గూగుల్‌ రాదు. అయినప్పటికీ RBI అధికారులు గడిచిన కొన్ని నెలలుగా అనేకసార్లు గూగుల్‌ ప్రతినిధులను పిలిచి అక్రమ లోన్‌ యాప్స్‌ విషయమై చర్చించారు. ఈ యాప్‌ లోన్స్‌ను చాలా మంది యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్థిక సేవల యాప్స్‌కు సంబంధించి తాము గతేడాది సెప్టెంబర్‌ నుంచి ప్రోగ్రామ్‌ పాలసీని మార్చినట్టు గూగుల్‌ ప్రకటించింది.

భారత్‌లో పర్సనల్‌ లోన్‌ యాప్స్‌కు ఇది వర్తిస్తుందని తెలిపింది. భారత్‌ను టార్గెట్‌ను ప్లేస్టోర్‌లో 2000 పర్సనల్‌ లోన్‌ యాప్స్‌ ఉన్నట్టు, అవన్నీ విధాన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని గూగల్‌ వెల్లడించింది. ఈ సమస్యను చక్కదిద్దేందుకు తగిన సాయమందిస్తామని గూగుల్‌ ప్రకటించింది. లెండింగ్‌ యాప్స్‌ విషయంలో పారిశ్రామిక సంఘాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు గూగుల్‌ వెల్లడించింది.

అయితే, గతంలో వ్యక్తిగత యాప్స్‌పై వచ్చే ఫిర్యాదులను గూగుల్‌ పట్టించుకునేది కాదు. అటు ఆర్థిక సేవలకు సంబంధించి కొత్త అడ్వర్టైజ్‌మెంట్‌ విధానాన్ని వచ్చే నెల నుంచి గూగుల్‌ ప్రారంభించబోతోంది. మరోవైపు ఆమోదించిన లెండింగ్‌ యాప్స్‌కు సంబంధించిన ఒక లిస్టును రూపొందించే పనిలో భారత ప్రభుత్వం, RBI ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా లోన్ యాప్స్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి