Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..? టీకాలపై జీఎస్టీ తొలగించే అవకాశం

Corona Vaccine: దేశంలో ఒక వైపు కరోనా.. మరో వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇక వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..? టీకాలపై జీఎస్టీ తొలగించే అవకాశం
Follow us

|

Updated on: Apr 29, 2021 | 3:33 PM

Corona Vaccine: దేశంలో ఒక వైపు కరోనా.. మరో వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇక వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజలపై మరింత భారం తగ్గించేలా టీకాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) తొలగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని వల్ల టీకా ధరలు తగ్గితే చాలా మంది ప్రైవేటుగా టీకా తీసుకుంటారని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. టీకాల కొనుగోలులో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలు, ప్రైవేటు కేంద్రాలు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. తయారీదారులు తమ ఉత్పత్తిలో 50 శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల ధరలను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌ టీకాను రాష్ట్ర ప్రభుత్వానికి డోసుకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600 చొప్పున విక్రయిస్తామని సీరమ్‌ సంస్థ ప్రకటించింది. ఇక కొవాగ్జిన్‌ ధర రాష్ట్రాలకు రూ.600, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1200గా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అయితే ఈ ధరలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రాగా, సీరం సంస్థ తమ ధరలను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ.300 చొప్పున విక్రయిస్తామని తాజాగా తెలిపింది.

ఇవీ చదవండి:Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

Biological E: హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్.. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి