Biological E: హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్.. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి

రోనాను ఎదుర్కోవడానికి ఆయుధంగా భావిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ముమ్మరంగా అందరికీ అందే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

Biological E: హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్.. బయోలాజికల్ ఈ రూపొందిస్తున్న టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి
Biological E Vaccine
Follow us
KVD Varma

|

Updated on: Apr 25, 2021 | 11:05 PM

Biological E: కరోనాను ఎదుర్కోవడానికి ఆయుధంగా భావిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ముమ్మరంగా అందరికీ అందే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మన దేశం నుంచి రెండు టీకాలు కోవాక్సిన్, కోవీషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలకు వేగంగా అందించే పనిలో నిమగ్నమయింది సర్కారు. ఇదిలా ఉంటె ఇప్పుడు హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా సిద్ధం అవుతోంది. మన హైదరాబాద్ నుంచి ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ అభివృద్ధి చేసింది. ఇక ఈసారి వంతు బయోలాజికల్ ఈ (బీఈ) సంస్థది కానుంది. ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు శనివారం అనుమతులు వచ్చినట్టు సంస్థ ఎండీ మహిమ దాట్ల తెలిపారు.

గత నవంబర్ లోనే మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది బీఈ. ఈ రెండు దశల్లోనూ చక్కని ఫలితాలు వచ్చాయి. ఇక మూడో దశ దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది. ఇది 18 నుంచి 80 సంవత్సరాల వయస్సులో వ్యాధి నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని, భద్రతను ఈ ట్రయల్స్ లో అంచనా వేస్తుంది.

అమెరికాలోని టెక్సాస్‌ చిల్ట్రన్స్‌ హాస్పిటల్‌ సెంటర్‌, డైనావాక్స్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌తో కలిసి బయోలాజికల్‌-ఈ సంస్థ టీకాను అభివృద్ధి చేసింది. ‘సీపీజీ 1018టీఎం’గా ఈ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ను పిలుస్తున్నారు. గతేడాది నవంబర్‌ రెండోవారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించారు. మొదటి, రెండు ప్రయోగాల్లో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌లో మొత్తం 360 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్టు సంస్థ తెలిపింది. ఇందులో 18- 65 సంవత్సరాల మధ్యవారు ఉన్నట్టు పేర్కొన్నది.

మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండోడోస్‌ వేసినట్టు, వ్యాక్సిన్‌ సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా తేలినట్టు సంస్థ చెప్పుకొచ్చింది. బీఈ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వచ్చే ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కోవాగ్జిన్, రెమిడిసివిర్ టీకాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇప్పుడు బయోలాజికల్ ఈ కూడా వ్యాక్సిన్ అందుబాటులో తెస్తుండటం నగరానికి గర్వకారణంగా మారనుంది. బీఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని టెక్సాస్‌ చిల్ట్రన్‌ హాస్పిటల్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ మరియా ఎలెనా బొట్టాజి తెలిపారు.

Also Read: Marriage: కోవిడ్ ఆసుపత్రే కల్యాణ మండపం..కరోనా పేషెంట్స్ అంతా బంధువర్గం.. వైద్య సిబ్బంది పెళ్లి పెద్దలు.. ఓ వధువు పెళ్లి!

NASA: చందమామ మీద రొమాన్స్ కోరిక..కుదిరేపని కాదని ఆ నాసా ట్రైనీ చేసిన పని తెలిస్తే.. అయ్యో అనుకుంటారు!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!