NASA: చందమామ మీద రొమాన్స్ కోరిక..కుదిరేపని కాదని ఆ నాసా ట్రైనీ చేసిన పని తెలిస్తే.. అయ్యో అనుకుంటారు!

వెన్నెల్లో ఆడుకోవాలని వుంటే ఆడుకోవచ్చు ఏ మేడమీదనో.. భార్యతో రొమాన్స్ చేయాలనే చిలిపి కోరిక ఉంటె అదీ ఏదోరకంగా తీర్చుకోవచ్చు.

  • Publish Date - 10:47 pm, Sun, 25 April 21
NASA: చందమామ మీద రొమాన్స్ కోరిక..కుదిరేపని కాదని ఆ నాసా ట్రైనీ చేసిన పని తెలిస్తే.. అయ్యో అనుకుంటారు!
Nasa Trainee

NASA: వెన్నెల్లో ఆడుకోవాలని వుంటే ఆడుకోవచ్చు ఏ మేడమీదనో.. భార్యతో రొమాన్స్ చేయాలనే చిలిపి కోరిక ఉంటె అదీ ఏదోరకంగా తీర్చుకోవచ్చు. మన కవులు చెప్పినట్టు వెన్నెల మాటున కొబ్బరి చెట్ల నీడలో భార్యతో కలిసి రొమాంటిక్ మూమెంట్స్ అనుభవించవచ్చు. కానీ, చంద్రుడి మీదకు వెళ్లి రొమాన్స్ చేయాలనిపిస్తే మాత్రం ఇదిగో ఇలానే కాలం కాటేసి.. కటకటాల వెనక్కి తీసుకువెళ్ళిపోద్ది. అందుకే అత్యాశ వద్దు.. అని మన పెద్దలు అంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే..

నాసా(NASA)కు చెందిన ఓ ట్రైనీ పేరు థాడ్‌ కి తన భార్యతో కలిసి చందమామ మీద శృంగారం చేయాలని అనిపించింది. నాసాలో కదా పనిచేసేది.. మరి అలాంటి కోరికలే పుడతాయి అంటారా? ఏమో మరి. సరే.. ఆ కోరిక ఎలానూ తీరేది కాదని మనోడికీ బాగా తెలుసు. తన కోరికను నాసా మన్నించి భార్యనొ.. గర్ల్ ఫ్రెండ్ నో కూడా ఇచ్చి చందమామ మీదకు పంపించదు కదా. అందుకే, సినిమా లెవెల్లో ఆ కోరిక తీర్చుకుందాం అనుకున్నాడు. చందమామ మీదనుంచి నాసా పరిశోధనల కోసం వచ్చిన రాళ్ళను తన మంచం మీద వేసుకుని భార్యతో ఓ రొమాంటిక్ సాంగ్ వేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముంది. చేసేది నాసాలోనే కదా. ఓ చిన్న దొంగతనం ప్లాన్ చేశాడు.
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల నాసా ల్యూనార్ ల్యాబ్‌లో దాచిపెట్టిన 101 గ్రాముల చంద్రుడి రాళ్లపై అతడు కన్నేశాడు. వాటి విలువ 21 మిలియన్ డాలర్లు. అంటే భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం.. రూ.157.48 కోట్లు. (అయితే, థాడ్‌కు మొదట్లో దాన్ని అమ్మాలనే ఆలోచన లేదు.) దాన్ని ఎలాగైన దొంగిలించి తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా దానికి అక్కడ పెద్దగా రక్షణ కూడా లేకపోవడంతో తన ప్లాన్ సులభంగా అమలు చేయవచ్చని లెక్కలేశాడు.

దొంగతనం ఇలా..
థాడ్ తన ప్లాన్‌ కోసం బెల్జియంకు చెందిన ఖనిజ శాస్త్రవేత్తను సంప్రదించాడు. అయితే, ఆ శాస్త్రవేత్త చంద్రుడి రాళ్లు చాలా విలువైనవని, చాలా డబ్బు వస్తుందని తెలిపాడు. దీంతో థాడ్ ఆలోచన మారిపోయింది. ఒక వైపు డబ్బు.. మరోవైపు తన కోరిక రెండూ తీరుపోతాయని మరింత అత్యాశకు పోయాడు. నాసాలో తనపాటు ఇంటర్న్ చేస్తున్న థాడ్ ప్రియురాలు టిఫ్నీ ఫోలర్, షే సౌర్‌లలో కలిసి ప్లాన్ తయారు వేశాడు. 2002, జులై రాత్రి.. ఆ ముగ్గురు తమ అధికారిక ఐడి కార్డులతో ల్యాబ్‌లోకి ప్రవేశించారు. అయితే, సేఫ్ లాకర్‌లో ఉన్న చంద్రుడి రాళ్లను దొంగిలించడం అంత సులభం కాదని థాడ్‌కు అర్థమైపోయింది. ఆ లాకర్‌కు ఉన్న ట్యాగ్ మీద ఉన్న కోడ్‌ను అర్థం చేసుకుని తిప్పితేనే అది తెరుచుకుంటుందని తెలుసుకున్నారు. కానీ, అది వారికి సాధ్యం కాలేదు. దీంతో మొత్తం లాకర్‌ను పెకిళించి ల్యాబ్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఓ హోటల్‌కు తీసుకెళ్లి దాన్ని రంపాలతో కట్ చేసి తెరిచారు.

కోరిక తీరింది ఇలా..
జాగ్రత్తగా చంద్రుని పైనుంచి నాసాకు వచ్చిన మట్టిని దొంగిలించిన తరువాత.. మన హీరో, అతని గర్ల్ ఫ్రెండ్ హోటల్ లోని మంచం పై తమ కోరిక తీర్చుకున్నారు. అందుకోసం చంద్రుడి రాళ్లను బూడిదలా చేసుకుని మంచంపై చల్లారు. ఆ మంచం చంద్రునిల ఫీల్ అయి తమ రొమాన్స్ కానిచ్చేశారు. ఆ తరువాత మిగిలిన రాళ్ళను బరువు ఎక్కువ రావాలని కొద్దిగా కల్తీ కూడా చేశారు. తరువాత ఆ రాళ్ళను అమ్మేశారు. కానీ, అవి కొనుక్కున్న వారికీ పనికిరాలేదు. ఎందుకంటే, మనోడు ముక్కలు చేసిన రాళ్ళలో చంద్రునిపై నుంచి తెచ్చిన ఆనవాళ్ళు చెరిగిపోయాయి.

సరదా తీరింది ఇలా..
సరే మరి దొంగతనం ఆగదు కదా. అందులోనూ నాసాలో చేసిన దొంగతనం. విషయం అధికారులకు తెలిసిపోయింది. దీంతో అబ్బాయిగారి ఉద్యోగం పీకేసి.. సరదా తీరేలా కుమ్మేసి.. జైల్లో పాడేశారు. అదండీ సంగతి.. ఏదో సినిమాలో ఎన్టీఆర్ అన్నట్టు పులి పడుకుంది కదా అని గేమ్స్ ఆడొద్దు.. చందమామ రాళ్ళే కదా అని ఎగస్ట్రాలు చేస్తే ఇలాగే, అవుతుంది! మంచి ఉద్యోగమూ పోయింది..చిప్పకూడు తినాల్సి వస్తోంది.

Also Read: Corona: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!