Fake Medicine: నకిలీ మందులని అరికట్టడానికి కేంద్రం కొత్త ఆలోచన.. ట్యాబ్లెట్ స్ట్రిప్స్ పై క్యూఆర్ కోడ్..

తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కల్తీ అయ్యాయి. అనారోగ్యానికి గురైనప్పుడు వేసుకునే మందులు సైతం నకిలీ మయం కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలో నకిలీ మందుల భరతం పట్టేందుకు..

Fake Medicine: నకిలీ మందులని అరికట్టడానికి కేంద్రం కొత్త ఆలోచన.. ట్యాబ్లెట్ స్ట్రిప్స్ పై క్యూఆర్ కోడ్..
Medicine Price
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 04, 2022 | 7:19 AM

తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కల్తీ అయ్యాయి. అనారోగ్యానికి గురైనప్పుడు వేసుకునే మందులు సైతం నకిలీ మయం కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలో నకిలీ మందుల భరతం పట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మందులపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనుంది. నకిలీ మందులను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకు రానుంది. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న మందులపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించాలని నిర్ణయించింది. మందులపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా, నకిలీవా గుర్తించేందుకు వీలు అవుతుందని కేంద్రం తెలిపింది. ఔషధాలు ప్యాక్‌చేసే బాటిల్స్‌, జార్‌, ట్యూబ్‌, స్ట్రిప్‌లపై ఈ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లను తొలుత 300 ఔషధాలపై ముద్రించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.100 కంటే ఎక్కువ విలువైన ఔషధాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి..ఆపై మిగిలిన మందులకూ విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.

ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఉపయోగించే బీపీ, యాంటీబయోటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్, విటమిన్‌ ఔషధాలను తయారుచేసే కంపెనీలకు క్యూఆర్‌ కోడ్‌ ముద్రణను తప్పనిసరి చేయనుంది. క్యూఆర్‌ కోడ్‌తో పాటు వినియోగదారుల కోసం ఓ పోర్టల్‌ను కూడా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పోర్టల్‌లో మందులపై ఉన్న ప్రత్యేకమైన కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా కూడా నకిలీలను గుర్తించవచ్చని తెలుస్తోంది.

నేటి పోటి ప్రపంచంలో ఏ కంపెనీ తయారు చేసే వస్తువులకైనా సరే వెంటనే నకిలీ తయారు చేస్తుంటారు. బ్రాండెడ్ సరకులను కొనుగోలోనూ నకిలీలు వస్తున్నాయి. ముఖ్యంగా మెడిసిన్ తయారీలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా కంపెనీలు తమ ఒరిజినల్ క్యూఆర్ కోడ్‌‌ను మందులపై ముద్రించనుంది కేంద్రం ప్రభుత్వం. దీంతో ఇక నకిలీ మందులు కనిపెట్టడం సులభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..