AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DL, RC Permit: డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే భారీ జరిమానా.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటినుంచంటే..?

కరోనా కారణంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

DL, RC Permit: డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే భారీ జరిమానా.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటినుంచంటే..?
Vehicle Renewal Driveing Licence,
Balaraju Goud
|

Updated on: Oct 13, 2021 | 8:11 PM

Share

Driving Licence Vehicle Permit: కరోనా కారణంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలుమార్లు చెల్లుబాటు తేదీని పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా డెడ్‌లైన్ విధించింది. గడువులోపు రెన్యువల్ చేసుకోవాలని కేంద్ర సర్కార్ సూచించింది.

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(RC), వాహనాల అనుమతి రెన్యువల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఈ డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి అక్టోబర్ 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ గడువు ఇకపై పొడిగించే అవకాశమే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, వెహికల్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి కేవలం 17 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31వ తేదీ తర్వాత అసంపూర్తి డాక్యుమెంట్‌లతో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే, జరిమానా భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని సరియైన పత్రాలు ఉంటేనే ఇకపై రోడ్లపైకి రావాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రవాణా శాఖ తమ సేవలను నిలిపివేసింది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ సహా అవసరమైన పత్రాలను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వచ్చింది. వాస్తవానికి వాహనాలకు సంబంధించిన పత్రాల గడువు ముగిసినా కూడా కరోనా కారణంగా ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటివరకు చెల్లుబాటు అయ్యేలా గతంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కానీ 31 అక్టోబర్ 2021 తర్వాత అది గడువు ముగిసినట్లుగా స్పష్టం చేసింది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ.

కరోనా కారణంగా, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల చెల్లుబాటును ఇప్పటివరకు 7సార్లు పెంచారు. 30 మార్చి 2020, 9 జూన్ 2020, 24 ఆగస్టు 2020, 27 డిసెంబర్ 2020, 26 మార్చి 2021, 17 జూన్ 2021 చివరిసారిగా 30 సెప్టెంబర్ 2021 న మంత్రిత్వ శాఖ చెల్లుబాటును పొడిగించింది. ఇందుకోసం మోటార్ వాహనాల చట్టంలో కూడా మార్పులు తీసుకుని వచ్చింది. కాగా, గడువులోగా , వాహనాల ధ్రవపత్రాలను సరిచేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

Read Also… Snapana Tirumanjanam: మొద‌టిసారిగా శ్రీవారికి ప‌టిక‌బెల్లం, కివి పండ్లు, ఎరుపు ప‌విత్రమాల‌ల‌తో స్నప‌న తిరుమంజ‌నం