Samosa Party: ఏటా 50 లక్షల అమ్మకాలు.. రూ. కోట్లలో ఆదాయం.. ఇదంతా సమోసాలతోనే అంటే నమ్ముతారా.?
Samosa Party: నలుగురు ఆలోచించని విధంగా ఆలోచిస్తానే విజయాన్ని సాధించగలం. సాధారణంగా అందరూ చేసే పనినే భిన్నంగా చేసి సంచలనాలు సృష్టిస్తుంటారు కొందరు. బెంగళూరుకు చెందిన ఇద్దరు ఇలాగే కొత్తగా...
Samosa Party: నలుగురు ఆలోచించని విధంగా ఆలోచిస్తానే విజయాన్ని సాధించగలం. సాధారణంగా అందరూ చేసే పనినే భిన్నంగా చేసి సంచలనాలు సృష్టిస్తుంటారు కొందరు. బెంగళూరుకు చెందిన ఇద్దరు ఇలాగే కొత్తగా ఆలోచించారు. పిజ్జాలు, బర్గర్లనే ఆన్‌లైన్‌లో అమ్మాలా.? సమోసాలను అమ్మలేమా.? ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే సమోసా పార్టీ. చిన్నగా మొదలైన ఈ సమోసా పార్టీ ఇప్పుడు 15 ప్రదేశాలలో అవుట్ లెట్లను ఓపెన్ చేసే స్థాయికి చేరుకుంది. సమోసాలతో రూ. కోట్లు సంపాదించాలనే ఆలోచన ఎలా వచ్చింది.? ఈ సక్సెస్ ఫుల్ స్టార్టప్ వెనకా ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బెంగళూరుకు చెందిన అమిత్ నన్వానీ, దీక్ష పాండేలకు సమోసాలను విభిన్నంగా ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా సమోసాకు కూడా ఓ బ్రాండ్ తీసుకురావాలని ప్రయత్నించారు. కేవలం పిజ్జాలు, బర్గర్లనే ఆన్‌లైన్‌లో విక్రయించాలా.? సమోసాలను ఎందుకు విక్రయించకూడదని ఫుడ్ డెలివరీ యాప్స్‌లోనూ విక్రయించడం ప్రారంభించారు. ‘సమోసా పార్టీ’ పేరుతో బెంగళూరులో వ్యాప్తంగా 15 స్టోర్‌లను ఓపెన్ చేశారు. వీరి వ్యాపారం కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు గురుగ్రామ్‌లో కూడా ఒక స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎందుకంత డిమాండ్..
భిన్నంగా ఆలోచించే వారే విజయం సాధిస్తారని చెప్పుకున్నట్లు.. వీరు సమోసా తయారు విధానంలో కూడా భిన్నత్వాన్ని పాటించారు. ఏకంగా 14 రకాల సమోసాలను తయారు చేశారు. వీరు అమ్మే ప్రతీ సమోసాపై ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ బట్టి సమోసా లోపల ఎలాంటి పదార్థాలను ఉపయోగించారన్న విషయాన్ని చెబుతుంది. నాణ్యత, రుచి విషయంలో రాజీ పడకపోవడమే తమ సక్సెస్‌కు కారణమని చెబుతారు అమిత్ నన్వానీ, దీక్ష పాండేలు. సమోసా పార్టీ ప్రతి నెలా 50,000ల సమోసాలను అమ్ముతున్నారు. ఇలా ఏడాదికి ఏకంగా 50 లక్షల సమోసాలను అమ్ముతూ కోట్ల రూపాయలను గడిస్తున్నారు.
Bathukamma Celebrations 2021: నిజామాబాద్ లో బతుకమ్మ సంబురాలు లైవ్ వీడియో