ప్రణబ్ కు ప్రముఖుల నివాళి

భారత్‌ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రణబ్‌ పార్థీవ దేహం ఆయన నివాసానికి చేరుకుంది. ప్రణబ్‌కు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాళులు అర్పించారు.

ప్రణబ్ కు ప్రముఖుల నివాళి
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 11:28 AM

భారత్‌ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రణబ్‌ పార్థీవ దేహం ఆయన నివాసానికి చేరుకుంది. ప్రణబ్‌కు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రణబ్‌ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ప్రణబ్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఉదయం 10.15 గంటల వరకు అధికార ప్రముఖులు, 10.15 నుంచి 11 గంటల వరకు ఇతర ప్రముఖులు, 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సాధారణ ప్రజలు సందర్శించి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

కరోనా కారణంగా భౌతికదూరం, వైద్యపరమైన నిబంధనలు అమల్లో ఉన్నందున ఆయన మృతదేహాన్ని గన్‌ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లోనే శ్మశాన వాటికకు తరలిస్తారు. కేంద్ర వైద్య ఆరోగ్య, హోంశాఖ జారీ చేసిన నిబంధనలు, ప్రొటో కాల్స్‌ను కఠినంగా అమలు చేయాలంటూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ప్రణబ్‌కు నివాళిగా రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేసింది.

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?